ఓటు హక్కు కాపాడుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఓటు హక్కు కాపాడుకోవాలి

Jun 27 2026 1:49 AM | Updated on Jun 27 2026 1:49 AM

గుర్రంకొండ : ఓటు హక్కు కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక గోల్డెన్‌ ప్లాజా కల్యాణ మండపంలో కలకడ, గుర్రంకొండ, కలికిరి మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో సర్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్‌ ప్రక్రియలో బీఎల్‌ఏలే అన్ని పనులు చేసుకోవడం కష్టమవుతోందన్నారు. వారికి స్థానిక నాయకులు సహకారం అందించాలని సూచించారు. అనంతరం పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సర్‌ ప్రక్రియలో బీఎల్వోఏలు, గ్రామస్థాయి నాయకులు సమష్టిగా కష్టపడాలన్నారు. అలాగైతేనే కార్యకర్తల ఓట్లు కాపాడుకోగలుతామన్నారు. మనం నిర్లక్ష్యం చేస్తే అన్ని ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఇక్బాల్‌అహ్మద్‌, రాష్ట్ర ఎండీసీ మాజీ డైరెక్టర్‌ హరీష్‌రెడ్డి, సర్‌ రాష్ట్ర పరిశీలకులు వజ్ర భాస్కర్‌రెడ్డి, భరత్‌భూషణ్‌రెడ్డి, పార్టీ నియోజకవర్గ పరిశీలకులు ఉదయ్‌కుమార్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మెన్‌ రవికుమార్‌రెడ్డి, మండల పార్టీ కన్వీనర్లు ముక్తియార్‌ ఆలీఖాన్‌, పులి శివారెడ్డి, కమాలాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ హారిక, ఆనంద్‌, ఎంపీపీలు అప్పల్ల, శ్రీదేవి, మాజీ ఎంపీపీలు నక్కాచంద్రశేఖర్‌, జమీర్‌, జయచంద్రారెడ్డి, నాయకులు జెల్లా రాజగోపాల్‌రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, రాంపల్లి రమేష్‌, కేశవరెడ్డి, నీళ్ల భాస్కర్‌, కలీమ్‌, షావత్‌ ఆలీఖాన్‌, ప్రకాష్‌రెడ్డి, వెంకటశివారెడ్డి, ఎల్వీ రమణ, జగన్‌మోహన్‌, ఎస్వీ రమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement