వాల్మీకిపురం : స్థానిక జీవీఎస్‌సీఎస్ క్రీడా మైదానంలో ఏసీఏ సౌత్‌జోన్ అండర్ 16 మల్టీడే క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. శుక్రవారం గ్రౌండ్ 1లో చిత్తూరు, అనంతపురం క్రికెట్ టీంలు తలపడ్డాయి. ఇన్నింగ్స్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చిత్తూరు జట్టు 96 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టానికి 344 పరుగులు చేసింది. చిత్తూరు జట్టుకు చెందిన బ్యాట్స్‌మెన్ లిఖిత్ ఇరగంరెడ్డి 234 బంతుల్లో 102 పరుగులు చేశారు. ఇదే జట్టుకు చెందిన తనీస్వర్ టెండూల్కర్ 268 బంతుల్లో 186 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరూ సెంచరీలతో చెలరేగి 67.4 ఓవర్లలో 221 పరుగులుభాగస్వామ్యం నెలకొల్పడంతో.. చిత్తూరు జట్టు భారీ స్కోర్‌లో ముందుకు వెళ్లడంతోపాటు బ్యాటింగ్ చేస్తోంది. అలాగే గ్రౌండ్ 2లో కర్నూలు, కడప జిల్లా జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కర్నూలు జట్టు 76 ఓవర్లలో 374 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇందులో కర్నూల్ జట్టుకు చెందిన బ్యాట్స్‌మెన్ నిశాంత్ రెడ్డి 129 బంతులు ఆడి 109 పరుగులతో సెంచరీ తీశాడు. నేడు కడప జట్టు బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ పోటీలను శ్రీధర్ కుమార్, సునీల్ కుమార్, ప్రసన్న కుమార్, షోయబ్, జవహర్ బాష, హరీష్ రెడ్డి, గిరీష్ తదితరులు పర్యవేక్షిస్తున్నారు.


