మదనపల్లె సిటీ: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఫుట్‌బాల్ జిల్లా సబ్ జూనియర్స్, జూనియర్ బాలికల జట్ల ఎంపిక జరుగుతుందని జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి మురళీధర్ తెలిపారు. పాఠశాలలో మధ్యాహ్నం 3 గంటలకు ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9502074146ను సంప్రదించాలని సూచించారు.
పోస్టర్ల ఆవిష్కరణ
సాక్షి, మదనపల్లె: ఇషా గ్రామోత్సవ కార్యక్రమ పోస్టర్లను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆవిష్కరించారు. గురువారం మదనపల్లెకు వచ్చిన మంత్రి స్థానిక బీజేపీ సీనియర్ నేత చల్లపల్లి నరసింహారెడ్డిని కలిశారు. సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ గ్రామీణ యువతకు తమ ప్రతిభను ప్రదర్శించుకునే వేదికగా ఇషా పోటీలు నిలుస్తాయన్నారు. జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర కుమార్ రెడ్డి, విజయభారతి సేతు, బీజేపీ సీనియర్ నాయకులు బర్నేపల్లె రవికుమార్, అజ్మతుల్లా ఖాన్, డాక్టర్ బాబు పాల్గొన్నారు.
పెరటి కోళ్ల పెంపకంతో ఉపాధి
– పశు సంవర్తక శాఖ జేడీ గుణశేఖర పిళ్లై
మదనపల్లె టౌన్: నిరుద్యోగ యువత ఆర్థిక ఇబ్బందులు అధిగమించాలంటే పెరటి కోళ్ల పెంపకం ఉత్తమ మార్గ మని అన్నమయ్య జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ కే.గుణశేఖర పిళ్లై సూచించారు. గురువారం మద నపల్లె జేడీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారీ బడ్జెట్‌తో కోళ్ల ఫారాలు నెల కొల్పలేని నిరుద్యోగ యువత తక్కువ ఖర్చుతో లాభాలు ఆర్జించ వచ్చన్నారు. మాంసాహారం, గుడ్లకు డిమాండ్ ఉన్న పెరటి నాటి కోళ్లను పెంచు కోవాలని సూచించారు. ముఖ్యంగా గిరిరాజ, వనరాజ, గ్రామప్రియ, రాజశ్రీ రకాల కోళ్లు త క్కువ పెట్టుబడితో మంచి ఆదాయం ఇస్తాయని జేడీ తెలిపారు. ఆసక్తి ఉన్న యువత పశుసంవర్ధక శాఖను సంప్రదిస్తే సాంకేతిక సహాయం, మార్గదర్శనం అందిస్తామని సూచించారు.
మదనపల్లె సిటీ: జాతీయ విద్యాశిక్షణ, పరిశోధనంస్థ, విజ్ఞానభారతి, నేషనల్ కౌన్సిల్ ఆప్ సైన్స్ మ్యూజియం సంస్థలు సంయుక్తంగా జాతీయ స్థాయిలో నిర్వహించే సైన్స్ టాలెంట్ పరీక్షల పోస్టర్‌ను గురువారం డీఈఓ సుబ్రమణ్యం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విజ్ఞానశాస్త్రంపై ఆసక్తి కలిగి, సృజనాత్మక ఆలోచనలు పంచుకోవడానికి విద్యార్థులకు మంచి అవకాశమన్నారు. ఈ పోటీల్లో ఆరవ తరగతి నుంచి 11వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులు పాల్గొనవచ్చునన్నారు. ఆసక్తికలిగిన విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకుని పరీక్షలకు హాజరు కావాలన్నారు. వివరాలకు సెల్ 7702202288తో పాటు, httpr:/vvm.orf,in వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాలు పొందవచ్చని వివరించారు.
ప్రజల హక్కులను
కాలరాసిన ఎమర్జెన్సీ
కురబలకోట: నాడు ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ దేశ చరిత్రలోనే చీకటి అధ్యాయమని రాష్ట్ర వైద్యారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కురబలకోట మండలంలోని అంగళ్లు గోల్డెన్‌వ్యాలీ కళాశాలలో గురువారం జరిగిన ప్రజా స్వామ్య హత్యాదినం సభలో ముఖ్య అతిధిగా ఆయన మాట్లాడుతూ అత్యవసర పరిస్థితి వల్ల రాజ్యాంగ హక్కులు హరించబడ్డాయన్నారు. ప్రజా స్వామ్యాన్ని ఉక్కు పాదంతో అణచివేసిన రోజే ప్రజా స్వామ్య హత్యదినంగా పరిగణించడం జరుగుతోందన్నారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రతిపక్ష నాయకులను జైలుకు పంపడం, పత్రికలపై ఆంక్షలు విధించడం వంటి చర్యలు ప్రజల గొంతుక నొక్కివేయడమేనన్నారు. ఇవి పునరావృతం కారాదన్నారు.


