ముగిసిన వైఎస్‌ జగన్‌ పర్యటన | - | Sakshi
Sakshi News home page

ముగిసిన వైఎస్‌ జగన్‌ పర్యటన

Jun 26 2026 3:59 AM | Updated on Jun 26 2026 3:59 AM

ముగిసిన వైఎస్‌ జగన్‌ పర్యటన

పులివెందులలో మూడు రోజులు

పర్యటించినమాజీ సీఎంవైఎస్‌ జగన్‌

భూమయ్యగారిపల్లెలో శ్రీలక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్టలో మాజీ సీఎం

పులివెందులలో పలు అభివృద్ధి

కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు

పులివెందుల : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలో మూడు రోజుల పర్యటన గురువారంతో ముగిసింది. పర్యటనలో భాగంగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను ఆయన ఆప్యాయంగా పలకరించారు. కూటమి ప్రభుత్వ అక్రమ కేసులకు భయపడొద్దని.. అండగా ఉంటానంటూ ధైర్యం కల్పించారు. రాబోయే రోజులలో మన ప్రభుత్వం ఏర్పడి మంచి రోజులు వస్తాయని పార్టీ కేడర్‌లో ధైర్యం నింపుతూ పర్యటన సాగించారు. తొలిరోజు భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకమయ్యారు. బుధవారం రెండవ రోజు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేముల మండలం భూమయ్యగారిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ట వేడుకలో పాల్గొన్నారు. అనంతరం పులివెందులలో అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమంలో రూ.1.50కోట్ల ఎంపీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. మూడవ రోజు గురువారం ఉదయం మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ బెంగుళూరుకు పయనమయ్యారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వీడ్కోలు పలికిన వారిలో రాజంపేట ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రమేష్‌ యాదవ్‌, కల్పలతారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి అంజాద్‌ బాషా, కమలాపురం వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జి నరేన్‌, నేతలు వజ్ర భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వేముల మండల పరిశీలకులు వేల్పుల రామలింగారెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement