పోతబోలు వద్ద చిరుత సంచారం? | - | Sakshi
Sakshi News home page

పోతబోలు వద్ద చిరుత సంచారం?

Jun 26 2026 3:59 AM | Updated on Jun 26 2026 3:59 AM

మదనపల్లె టౌన్‌: జిల్లాలోని మదనపల్లె మండలం, పోతబోలు గ్రామానికి సమీపంలోని నూరు కుప్పలకొండ పరిసరాల్లో చిరుతపులి సంచరిస్తోందని గురువారం పుకార్లు షికారు చేశాయి. ఈ విషయమై పోతబోలు మాజీ సర్పంచ్‌ పటాన్‌ ఖాదర్‌ ఖాన్‌ వెంటనే ఫారెస్ట్‌, పోలీస్‌ అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి జయప్రసాద్‌ రావు సిబ్బందిని పోతబోలుకు పంపించారు. వారు ప్రస్తుతం చిరుత అడుగు జాడలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా రాత్రి వేళల్లో బయట తిరగవద్దని, పిల్లలు, పశువులను జాగ్రత్తగా చూసుకోవాలని ఫారెస్ట్‌ అధికారులు సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement