గణతంత్ర వేడుకలకు కడప కళాకారిణి
కడప సెవెన్‌రోడ్స్: ఢిల్లీలోని ఎర్రకోటలో ఈనెల 26వ తేది జరిగే గణతంత్ర దిన వేడుకల్లో భాగంగా నిర్వహించనున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కడప కూచిపూడి కళాకారిణి మూలి పల్లవికి దక్కింది. ఆంధ్ర రాష్ట్రం నుంచి 30 మంది కూచిపూడి కళాకారులను భారత సాంస్కృతిక శాఖ ఎంపిక చేయగా, అందులో వైఎస్సార్ కడపజిల్లా నుంచి పల్లవి ఎంపికయ్యారు. కడప నగరం శంకరాపురానికి చెందిన ఆమె భారత సాంస్కృతికశాఖ ఆహ్వానం మేరకు ఢిల్లీకి చేరుకుని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ, సంగీత నాటక అకాడమి కేంద్రాల్లో ప్రత్యేక సాధన చేస్తున్నారు.
తిరుపతి సిటీ: స్థానిక వరదరాజ నగర్‌లోని విశ్వం టాలెంట్ స్కూల్ ప్రాంగణంలో విశ్వం సైనిక్, నవోదయ ప్రవేశ పరీక్షల– 2026 బ్రోచర్‌ను ఎమ్మెల్సీ రామచంద్రరెడ్డి, విశ్వం విద్యా సంస్థల అధినేత డాక్టర్ విశ్వనాథరెడ్డి, అకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వచందన్ రెడ్డి, ఎన్.విశ్వశ్రీ ఆవిష్కరించారు. శనివారం పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ 2025 సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంకుతోపాటు 63 సీట్లు, అలాగే నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షల్లో 69 సీట్లు సాధించి విశ్వం విద్యాసంస్థ రికార్డు సృష్టించడం గర్వించదగ్గ విషయమన్నారు. గత 35 ఏళ్లుగా సైనిక్, నవోదయ స్కూల్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో అగ్ర ర్యాంకులు సాధిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దడంలో విశ్వం విద్యా సంస్థలు ప్రత్యేక గుర్తింపు పొందాయని కొనియాడారు. అనంతరం డాక్టర్ ఎన్ విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షల్లో 46 రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంకులతోపాటు మొత్తం 967 సీట్లు సాధించడం శిక్షణ రంగంలో ఒక అరుదైన రికార్డు అని పేర్కొన్నారు. సైనిక్, నవోదయ, మిలిటరీ స్కూల్ ప్రవేశ పరీక్షలపై మరింత సమాచారం కోసం 86888 88802, 93999 76999 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
పెద్దతిప్పసముద్రం: ప్రతి సోమవారం ప్రజల నుంచి వచ్చే పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులపై అధికారులు అలసత్వం వీడాలని.. ఫిర్యాదుదారులను నిత్యం కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా సకాలంలో సమస్యలు పరిష్కరించి రైతాంగ ప్రజల మన్ననలు పొందాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టర్ మండలంలోని కాట్నగల్లు గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. సచివాలయంలోని హాజరు పట్టిక, వీఆర్వోకు సంబంధించిన రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. రీసర్వేకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులను చూసి అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్బంగా కలెక్టర్ అధికారులనుద్దేశించి మాట్లాడుతూ సచివాలయం ద్వారా అందుతున్న ప్రభుత్వ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ప్రజల నుంచి ఫిర్యాదులను అందుకున్నారు. తమ గ్రామంలో అంబేడ్కర్ భవన్, కమిటీ హాల్ మంజూరు చేయాలని దళితులు కలెక్టర్‌కు విన్నవించారు. తహశీల్దార్ శ్రీరాములు నాయక్, డీటీ విద్యాసాగర్, ఎంపీడీఓ ప్రతాప్‌రెడ్డి ఉన్నారు.
గణతంత్ర వేడుకలకు కడప కళాకారిణి


