విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో గుడిసె దగ్ధం
చౌడేపల్లె : విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పూరి గుడిసె దగ్ధమైన సంఘటన మండలంలోని కాగతి పంచాయతీ పలగార్లపల్లెలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రెడ్డెమ్మ పూరి గుడిసెలో నివసిస్తోంది. కుటుంబంలోని ఓ వ్యక్తికి చెందిన ల్యాప్‌టాప్‌కు చార్జింగ్ పెట్టారు. కాసేపటి తరువాత విద్యుత్ వైర్ల షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పూరిగుడిసెకు నిప్పంటుకుంది. ఆ సమయానికి ఇంటిలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఇంటిలోని సామగ్రితోపాటు ల్యాప్‌టాప్ అగ్నికి కాలి ధ్వంసమైంది. ఈ ఘటనలో సుమారు లక్ష మేరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితురాలు తెలిపింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు కోరారు.
గుర్తు తెలియని
వృద్ధుడు మృతి
రాయచోటి టౌన్ : రాయచోటి పట్టణ శివార్లలో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందినట్లు అర్బన్ సీఐ బీవీ చలపతి తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం సాయంత్రం రాయచోటి పట్టణ సమీపంలోని గున్నికుంట్ల రోడ్డుకు దగ్గరగా ఇనాత్‌ఖాన్ చెరువు సమీపంలో కంపచెట్ల మధ్యలో గర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే తన సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి వెళ్లి మృతుడిని పరిశీలించారు. మృతుడికి సుమారు 65–70 సంవత్సరాల మధ్య వయసు ఉండవచ్చుని అంచనా వేస్తున్నారు. సంఘటన స్థలాన్ని బట్టి రెండు రోజుల క్రితమే మృతి చెందినట్లుగా అనుమానిస్తున్నారు. ఉన్న ఆధారం ప్రకారం ఎవరైనా ఆచూకీ చెప్పాలని కోరారు. సెల్ నంబర్ 9121100559/9121100560/9121100561లకు ఫోన్ చేయవల్సిందిగా సూచించారు.
డ్రైనేజీలో పడి వృద్ధుడికి గాయాలు
రొంపిచెర్ల : డ్రైనేజీ కాలువలో పడి వృద్ధుడికి తీవ్ర గాయాలైన సంఘటన చైన్నై–అనంతపురం హైవేలోని రొంపిచెర్ల క్రాస్ రోడ్డులో శనివారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. రొంపిచెర్ల మండలం బోడిపాటివారిపల్లె గ్రామ పంచాయతీ మెడసానివారిపల్లెకు చెందిన దొరస్వామి నాయుడు(70) పని మీద తిరుపతికి వెళ్లి తిరిగి రొంపిచెర్ల క్రాస్ రోడ్డులోని బస్‌స్టాప్ వద్ద బస్సు దిగాడు. హైవేలో అండర్ పాస్ దాటుకుని రొంపిచెర్లకు వెళ్లుతూ విద్యుత్ దీపాలు వెలగక పోవడంతో రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీ కాలువలో పడ్డారు. దీంతో చూట్టు పక్కల వారు చూసి కాలువ నుంచి బయటకు తీశారు. తీవ్రంగా గాయ పడిన దొరస్వామి నాయుడును 108లో చికిత్స కోసం అన్నమయ్య జిల్లా పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నేషనల్ హైవేలో విద్యుత్ లైట్లు వెలగడం లేదని, దీంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపించారు. అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకుని రొంపిచెర్ల క్రాస్ రోడ్డులోని హైవేలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని వారు కోరారు.
పీలేరు రూరల్ : అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన పీలేరు మండలం బోడుమల్లువారిపల్లె పంచాయతీ గాండ్లపల్లె వద్ద చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. శుక్రవారం సాయంత్రం గాండ్లపల్లె దళితవాడ సమీపంలోని కాటంరాజు వద్ద సంక్రాంతి కనుమ పండుగ నిర్వాహించారు. ఈ ప్రాంతంలో గుర్తుతెలియని యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడాన్ని శనివారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు ఎవరైంది ఎలాంటి ఆధారాలు లేవని ఎస్‌ఐ ఎస్.రహీమ్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో గుడిసె దగ్ధం
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో గుడిసె దగ్ధం
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో గుడిసె దగ్ధం


