రెడ్డెమ్మ దేవస్థానం వద్ద గోపూజ
గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లి రెడ్డెమ్మ దేవత దేవస్థానంపై శుక్రవారం గోపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోమాతకు విశేష అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. గోపూజ విశిష్టతను అర్చకులు భక్తులకు వివరించారు. అనంతరం ముగ్గుల పోటీలు, ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి ఆలయ చైర్మెన్ రాజన్న నాయుడు చేతులమీదుగా బహుమతులను అందించారు.
చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి శుక్రవారం భక్తిశ్రద్ధలతో గంగమ్మకు రాహుకాల అభిషేకపూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు అమ్మ వారి గర్భాలయంను శుధ్దిచేశారు. రాహుకాల సమయం 10:30 గంటలనుంచి 12 గంటల వరకు సాంప్రదాయరీతిలో అర్చనలు ,అభిషేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా బంగారు నగలు, రంగు రంగు పూలతో ముస్తాబు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఉభయదారులకు పవిత్ర తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వవిద్యాలయంలో ఈ నెల 19వ తేదీ యోగి వేమన జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రజా సంబంధాల విభాగ సంచాలకులు డాక్టర్ పి.సరిత తెలిపారు. ఉదయం 11 గంటలకు విశ్వవిద్యాలయ అధికారులు యోగి వేమన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు విశ్వవిద్యాలయంలోని నూతన పరిపాలనా భవనంలోని అన్నమాచార్య సెనేట్ హాల్‌లో సమావేశం జరుగుతుందన్నారు.
ములకలచెరువు: మిసెస్ ఇండియా విజేత అన్నమయ్య జిల్లా సంబేపల్లెకు చెందిన విజయలక్ష్మి కవ్వం శుక్రవారం ములకలచెరువు మండలంలో సందడి చేశారు. ములకలచెరువు మండలం గుండాలవారిపల్లెకు చెందిన ఆమె సమీప బంధువు శంకర్‌రెడ్డి ఇంటికి వచ్చారు. అనంతరం బంధువు పంట పొలంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యవసాయానికి చెట్ల ప్రాధాన్యత గురించి ఆమె వివరించారు.
రెడ్డెమ్మ దేవస్థానం వద్ద గోపూజ
రెడ్డెమ్మ దేవస్థానం వద్ద గోపూజ


