కోటలో కోలాహలం
గంగాధర శాస్త్రి ప్రసంగం వివాదాస్పదం
డ్రమ్స్ శివమణి వాయిద్య ప్రదర్శన
జమ్మలమడుగు/జమ్మలమడుగు
రూరల్: గండికోటలో పర్యాటకుల కోలాహాలం నెలకొంది. మంగళవారం గండికోట ఉత్సవాలు చివరి రోజు కావడంతో పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ముద్దనూరు, జమ్మలమడుగు రూట్లు ద్విచక్రవాహనాలు కార్లు, ప్రత్యేక బస్సులతో నిండిపోయాయి. చరిత్రాత్మక గండికోటను తిలకించడానికి యువతీ యువకులతో పాటు వృద్ధులు సైతం ప్రత్యేక ట్రాక్టర్లు ఆటోలలో వచ్చారు.
ప్రమాదపు అంచున సెల్ఫీలు
గండికోట ఉత్సవాలకు వచ్చిన పర్యాటకులు సెల్ఫీలతోనే నిమగ్నమయ్యారు. ప్రమాదం అని తెలిసిన కోట గొడల చివరికి వెళ్లి కుటుంబ సభ్యులతో సెల్పీలు దిగారు. గండికోట ఉత్సవాలలో మాధవరాయస్వామి ఆలయం, జూమ్మామసీదు , రంగనాథస్వామి ఆలయం, పెన్నాగాడ్జ్ ప్రాంతంలో భారీగా పర్యాటకులతో కిక్కిరిసిపోయింది.
సాహస క్రీడలకు డిమాండ్..
గండికోటలో సాహస క్రీడలకు డిమాండ్ పెరిగింది. గండికోట ప్రారంభంలోనే గుర్రపుశాల వద్ద, జీప్‌రైడింగ్ ,బైక్ రైడింగ్ వద్ద పెద్దలు పిల్లలు క్యూకట్టారు. ఇక హెలీకాఫ్టర్ రైడింగ్‌క్ మూడో రోజూ డిమాండ్ కొనసాగింది. చాలా మందికి అవకాశం రాక వెనుదిరిగారు. కనీసం పారా గ్‌లైడరైనా ఎక్కి కోట అందాలు చూద్దామని పర్యాటకులు ఆశించినా నిర్వాహకులు నడపలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
విజేతలకు బహుమతుల ప్రదానం
గండికోట ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ విభాగాల్లో గెలుపొందిన వారికి కలెక్టర్ శ్రీధర్ చెరకూరి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం స్టేజి పైన విద్యార్థులు , మహిళలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
అయ్యా సౌండ్ పెంచు...
అయ్యా సౌండ్ పెంచు గండికోట ఉత్సవాలకు సౌండ్ సక్రమంగా లేకుంటే ఎలా అంటూ మిమిక్రి ఆర్టిస్టు శివారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తాను పలుమార్లు సౌండ్ పెంచాలని చెప్పిన ఇలా చేయడం సరైంది కాదని వాపోయారు. అనతరం తన కార్యక్రమాన్ని కొనసాగించారు.
మిమిక్రీని ప్రదర్శిస్తున్న శివారెడ్డి
ప్రదర్శనలను తిలకిస్తున్న కలెక్టర్, ఎమ్మెల్యే
కోటలో సందడి చేసిన కిరణ్ అబ్బవరం
జమ్మలమడుగు: గండికోట ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక వేత్త, కేంద్ర సంగీత నాటక అకాడమి అవార్డు గ్రహీత గంగాధర శాస్త్రి ప్రసంగం వివాదాస్పదంగా మారింది. మంగళవారం చివరి రోజు ఆధ్యాత్మిక ప్రసంగం చేసిన ఆయన భగవద్గీత గురించి మాట్లాడారు. అయితే ప్రసంగంలో మంచీ చెడుల గురించి చెప్పాల్సింది పోయి ఇతర మతాల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఒక నరేంద్ర మోదీలాగా హిందువులను రక్షించుకునే విధంగా తయారు కావాలని పిలుపునిచ్చారు.గండికోటలో జరిగేది పర్యాటక ఉత్సవం. అన్ని వర్గాల వారు వచ్చి ఉంటారు.. ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమయ్యాయి.
కోటలో కోలాహలం
కోటలో కోలాహలం
కోటలో కోలాహలం


