సంక్రాంతి శుభాకాంక్షలు
పుంగనూరు: నూతన సంవత్సర బోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రజలందరు సుఖసంతోషాలతో జరుపుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలు ఆకాంక్షించారు. మంగళవారం వారు మాట్లాడుతూ పండుగలను గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు బంధుమిత్రులతో కలసి సంతోషంగా జరుపుకోవాలని కోరారు. గ్రామప్రాంతాలలో పంటలు బాగా పండి, వ్యాపారాలు బాగా అభివృద్ధి చెంది, ప్రతి ఇంటా సిరులు పండాలని వారిద్దరు ఆకాంక్షించారు.
పులిచెర్ల(కల్లూరు): చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలోని దేవళంపేట పంచాయతీ దిగువ మూర్తివారిపల్లె, గంటావారిపల్లెల్లో మంగళవారం తెల్లవారుజామున ఏనుగులు రైతుల భూముల్లో ప్రవేశించి పంటలను ధ్వంసం చేసాయి. గంటావారిపల్లెలో మామిడి తోపులకు వేసిన డ్రిప్ పరికరాలను, మోటరును ధ్వంసం చేశాయి. అలాగే మామిడి చెట్లను కొమ్మలతో సహా పూర్తిగా విరిచేసి ఎందుకూ పనికి రాకుండా చేసాయి.గతంలో మామిడి కొమ్మలను మాత్రమే విరిచే ఏనుగులు ఇప్పుడు చెట్లను పూర్తిగా విరిచేస్తున్నాయి. దీనితో రైతు కోలుకోని విధంగా పూర్తిగా నష్టపోతున్నాడు.
రాయచోటి: సంక్రాంతి పండుగ సందర్భంగా అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేటు బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా రవాణాశాఖ అధికారి ప్రసాద్ తెలిపారు. ఇప్పటికే అదనపు చార్జీలు వసూళ్లకు పాల్పడుతున్న పలు బస్సులపై 13 కేసులు నమోదు చేశామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్బంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రైవేటు బస్సులు అధిక చార్జీలు వసూలు చేయకుండా నియంత్రించేదుకు ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ కఠిన చర్యలు చేపట్టిందని వివరించారు. ఐదు రోజులుగా ఆర్‌టీజీఎస్ పర్యవేక్షణతోపాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ధరల పర్యవేక్షణ బృందాలు ద్వారా అన్ని ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్ యాప్‌లోని బస్సు చార్జీలను నిరంతరం పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన వెంటనే సంబంధిత ప్రైవేటు బస్సు యజమానులతో అధికారులు సమన్వయం చేసి చార్జీలను తక్షణమే తగ్గించి నియంత్రించే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎక్కువ ధరకు టిక్కెట్లు విక్రయిస్తే సంబంధిత బస్సు యాజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రయాణికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా హెల్ప్‌లైన్ నెంబరు 9281607001ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హెల్‌లైన్ నెంబర్‌ను ప్రతి ప్రైవేటు బస్సులో తప్పనిసరిగా స్పష్టంగా ప్రద రించాలని బస్సు యజమానులకు ఆదేశాలు జారీ చేశామని అందులో పేర్కొన్నారు. కాగా తనిఖీలలో అధిక చార్జీలు వసూలు చేసిన 13 బస్సులపై కేసులు నమోదు చేసి రూ. 1,30, 000లు జరిమానా విధించామన్నారు. అలాగే పన్ను, ర్మిట్ వంటి ఇతర నిబంధనలు ఉల్లంఘించన రెండు బస్సులపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ ప్రత్యేక తనిఖీలు, పర్యవేక్షణ ప్రక్రియ జనవరి 18 వరకు కొనసాగుతాయని తెలిపారు.
పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి,
రాజంపేట ఎంపీ
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,
మాజీ మంత్రి
సంక్రాంతి శుభాకాంక్షలు
సంక్రాంతి శుభాకాంక్షలు


