● మార్చిలో జరిగే ఉత్సవాలే వీరికి సంక్రాంతి
ఏటా మార్చినెలలో నిర్వహించే గ్రామదేవత శ్రీ పల్లావలమ్మ జాతర ఉత్సవాలే ఇక్కడి ప్రజలకు సంక్రాంతి పండుగ. గ్రామదేవత శ్రీ పల్లావలమ్మ ఆజ్ఞానుసారం ప్రకారం ఈ పండుగ జరపకూడదంటూ పూర్వకాలంలో గ్రామపెద్దలు నిర్ణయించారు. వారి ఆదేశాలనే నేటికీ ఇక్కడ ప్రజలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. గ్రామంలో కొన్ని పశువులను గ్రామదేవత పల్లావలమ్మ పేరుమీద వదిలేసి కొందరు వాటిని మేపుతుంటారు. ప్రతి ఏడాది మార్చినెలలో శ్రీ పల్లావలమ్మ జాతర ఉత్సవాలు జరపుతుంటారు. ఆ ఉత్సవాల రోజున అమ్మవారి పేరుమీద వదిలిన ఆవులను మాత్రమే అందంగా అలంకరించి వాటిని ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. అక్కడ వాటికి భక్తిశ్రద్ధలతో గ్రామస్తులందరూ పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అదేవారికి సంక్రాంతి పండుగ.


