మూడు ఆలయాల్లో చోరీ
● అమ్మవారి తాళ్లి బోట్లు చోరీ
● కోదండరామాలయంలో హుండీ చోరీ
చోరీకి గురైన పెండ్ల గంగమ్మ ఆలయం చోరీకి గురైన కోదండ రామాలయం
రొంపిచెర్ల : మండలంలోని మోటుమల్లెల గ్రామ పంచాయతీలో సోమవారం రాత్రి మూడు ఆలయాల్లో గుర్తు తెలియని వ్యక్తలు అమ్మవారి నగలు, డబ్బు చోరీ చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదినవారిపల్లెలోని శ్రీరాముల గుడి తాళాలు పగలగొట్టి ఆరు అమ్మవారి తాళ్లి బోట్లును చోరీ చేశారు. అలాగే పెండ్ల గంగమ్మ ఆలయంలో హుండీలో నగదు చోరీ చేశారు. సవ్వాలవారిపల్లె కోదండ రామాలయంలో అమ్మవారి మంగళసూత్రం, ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీని చోరీ చేశారు. మూడు ఆలయాల్లో సుమారు రూ.40 వేలు విలువ చేసే బంగారు నగలు, రూ.15 వేలు నగదును చోరీ చేశారని గ్రామస్థులు తెలిపారు. ఆదినవారిపల్లె ఆలయాల్లో ఆరు నెల క్రితం దొంగలు దొంగతనం చేశారని, మళ్లీ ఇప్పుడు చోరీ చేశారని గ్రామస్థులు తెలిపారు. ఈ విషయాన్ని ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రొంపిచెర్ల పోలీసులు చోరీలు జరిగిన ఆలయాలను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక పోలీసులు చోరీలు జరిగినప్పుడు వచ్చి చూసి వెళ్లుతున్నారే తప్పా దొంగలను పట్టుకుంది లేదన్నారు. దీంతో మండలంలో ఎక్కడ చూసిన విచ్చల విడిగా చోరీలకు పాల్పడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పుటికై న అధికారులు తగు చర్యలు తీసుకుని చోరీదారులపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
మూడు ఆలయాల్లో చోరీ


