● కోనసీమను తలపించేలా కోడి పందేలు..
ములకలచెరువులో నకిలీమద్యం తయారీ ప్లాంటు వెలుగుచూసిన కేంద్రానికి సమీపంలోనే టీడీపీ నేతలు బహిరంగంగా కోడిపందేలు నిర్వహించారు. దీనికి వేలసంఖ్యలో జనం వచ్చారు. కార్లు, బైక్‌లు వందల సంఖ్యలో రోడ్లపై బారులు తీరాయి. కోనసీమను తలదన్నేలా కోడిపందేలు జరిగాయి. ఇక పీటీఎం మండలం పులికల్లు సమీపంలో జరిగిన కోడిపందాల శిబిరంలో ఇలాగే ఉంది. ఈ శిబిరం చుట్టూ ఏకంగా కంచెలాంటి తెరను కట్టించారు. లోపలికి వచ్చేవారు ఫొటోలు, వీడియోలు తీయకుండా కట్టడి చేయడం, నిఘా కోసం ప్రత్యేకంగా సిబ్బందిని పెట్టినట్లు సమాచారం. ఈ కోడిపందేల శిబిరంలో పేకాట జూదం, మద్యం విక్రయాలు జోరుగా సాగించారు. తమ దృష్టికి రాలేదన్న కుంటిసాకుతో పోలీసులు అటువైపు వెళ్లలేదు. మరి కోడి పందేలు నిషేధం, దానిపై కఠినచర్యలు తీసుకుంటామన్న ఎస్పీ, జాయింట్ కలెక్టర్ మాటలు ప్రకటనలకే పరిమితమవుతాయా.. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకుంటారా.. అనేది వారికే తెలియాలి.


