● జోరుగా మంగతై, బుడబుక్కలాట
పులివెందుల రూరల్ : పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె, కొత్తపల్లె తదితర గ్రామాల్లో కోడిపందేలు భారీగా జరిగాయి. కోళ్లకు కత్తులు కట్టకుండా పందాలు ఆడుకోవచ్చునని, జంతు బలులను నిషేధించాలని హైకోర్టు కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే 144 సెక్షన్ విధించాలని పోలీసులను ఆదేశించింది. కానీ కోడి పందాల వద్ద పోలీసుల జాడ కనిపించింటే ఒట్టు. మరోపక్క కోడిపందాల మాటున విచ్చలవిడిగా మంగతై, బుడుబుక్కలాటలతోపాటు మరికొన్ని అసాంఘిక కార్యకలాపాలు యథేచ్చగా జరుగుతున్నాయి. బుడబుక్కలాటలో చిన్నపిల్లలు సైతం పాల్గొని పందేలు కాయడం విచారకరం.


