రేపు బండలాగుడు పోటీలు
చాపాడు : సంక్రాంతి పండుగను పురస్కరించు కుని మండలంలోని వెదురూరు, నరహరిపురం గ్రామాల్లో శుక్రవారం రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి జరిగే ఈ పోటీల్లో గెలుపొందిన ఎద్దుల యజమానులకు రూ.1,00,116, రూ.70, 116, రూ.40,116, రూ.20,115, రూ.10,116 చొప్పున నగదు బహుమతులు అందజేయనున్న ట్టు నిర్వాహకులు తెలిపారు.
ఆలయ నిధులపై
సమగ్ర వివరాలు ఇవ్వాలి
మదనపల్లె: సీటీఎంలోని నలవీర గంగాభవానీ ఆలయ నిధులపై సమగ్ర వివరాలను వచ్చే సోమవారం నాటికి ఇవ్వాలని ఆలయ కమిటీ నిర్వాహకులను దేవదాయశాఖ జిల్లా అధికారి విశ్వనాఽథ్ ఆదేశించారు. బుధవారం ఆలయంలో గ్రామస్తులు, కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ ఆదాయం, ఖర్చులు, ఆభరణాల విషయమై పీజీఆర్‌ఎస్‌కు రెండు ఫిర్యాదులు అందాయని, దీనిపై విచారణ చేయాలని కలెక్టర్ తనను ఆదేశించారని చెప్పారు. ఆలయానికి సొంతంగా ఎంతమేరకు ఆదాయం వస్తోంది, విరాళాలు, భక్తులు అందించిన బంగారు ఆభరణాలు తదితర వివరాలు ఇవ్వాలని కోరారు. ఈ వివరాలను పూర్తిగా అందిస్తామని కమిటి నిర్వాహకులు చెప్పారు. జాతర ఉత్సవాల సందర్భంగా భక్తులు ఇస్తున్న విరాళాల ను తెలపాలని గ్రామస్తులు ప్రశ్నించారు. విశ్వనాఽథ్ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలతో విచారణ జరిపి నివేదికను ఇవ్వనున్నట్టు చెప్పారు.


