రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
పీలేరు రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన మండలంలోని పొంతలచెరువు క్రాస్ వద్ద చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిలో చోటు చేసుకుంది. సీఐ యుగంధర్ కథనం మేరకు వివరాలిలావున్నాయి. కేవీపల్లె మండలం నూతనకాల్వ పంచాయతీ చిన్నకంభిరెడ్డిగారిపల్లెకు చెందిన పఠాన్ అస్లామ్ (26), అదే గ్రామానికి చెందిన ఎస్. మున్నా (28) పీలేరులో సమీప బంధువుల ఇంటికి వచ్చారు. మంగళవారం రాత్రి స్వగ్రామానికి ద్విచక్రవాహనంలో బయలు దేరారు. అయితే మార్గం మధ్యలో రాయచోటి నుంచి చిత్తూరు వైపు వెళుతున్న లారీ ఢీకొంది. ప్రమాదంలో అస్లామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మున్నను చికిత్స నిమిత్తం 108లో తిరుపతికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. అస్లామ్‌కు సుండుపల్లె మండలం రాయవరం గ్రామానికి చెందిన మెహతాజ్‌తో నెల రోజుల కిందటే వివాహం జరిగింది. మున్నాకు భార్య జ్యోతి తోపాటు ఒక కుమార్తె కలదు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు రోడ్డు ప్రమాదంలోమృతి చెందడంలో చిన్నకంభిరెడ్డిగారిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమీప బంధువులు పెద్ద ఎత్తున పీలేరు ప్రభుత్వాస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
అస్లామ్ (ఫైల్) మున్నా (ఫైల్)
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం


