రామయ్య సన్నిధిలో సౌత్ సెంట్రల్ రైల్వే ఐజీ
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామిని సౌత్ సెంట్రల్ రైల్వే ఐజీ/పీసీఎస్‌సీ (ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్) అరోమా సింగ్‌ఠాకూర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికి, ప్రదక్షిణ గావించి గర్భాలయంలోని మూలవిరాట్‌కి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈమె వెంట గుంతకల్ డివిజన్ డీఎస్‌సీ ఆకాశ్‌జైస్వాల్, కడప ఆర్‌పీఎఫ్ సీఐ కోటేశ్వరరావు, రేణిగుంట రైల్వే క్రైం బ్రాంచ్ సీఐ మునిప్రసాద్, ఒంటిమిట్ట సీఐ నరసింహరాజు, నందలూరు ఓపీ ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ త్రివేణి, ఒంటిమిట్ట ఎస్‌ఐ శ్రీనివాసులు ఉన్నారు.
రామయ్య సన్నిధిలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు
ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి ఆలయంలో మండలంలోని మంటపంపల్లికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలైన పుట్లంరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, పుట్లంరెడ్డి ప్రతాపరెడ్డి కుటుంబసభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ రంగమండపంలో సేదతీరిన వారిని డిప్యూటీ ఈఓ ప్రశాంతి ఘనంగా సత్కరించి, అర్చకుల చేత స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా పారివ్రామికవేత్తలు స్వామి వారి భక్తులకు మూడు పూటలా అన్నప్రసాదం కల్పించాలని డిప్యూటీ ఈఓకు స్పష్ట సూచనలు చేశారు. తొందరలోనే ప్రారంభం కానున్న తాత్కాలిక నిత్య అన్నదాన కేంద్రానికి వారి సహాయ సహకారాలు అందించాలని డిప్యూటీ ఈఓ ప్రశాంతి కోరగా దానికి వారు సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ఒంటిమిట్ట జడ్పీటీసీ అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి, ఎంపీటీసీ సుంకేసుల భాషా, సుభాన్‌బాషా తదితరులు పాల్గొన్నారు.


