పది మూల్యాంకనంలో నిర్లక్ష్యం
రాయచోటి జగదాంబసెంటర్ : పదో తరగతి ఫలితాల మూల్యాంకనంలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిందని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకర చక్రధర్, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు జంగంరెడ్డి కిషోర్‌దాస్ అన్నారు. మంత్రి లోకేష్ రాజీనామా కోరుతూ డీఈఓ సుబ్రహ్మణ్యంను శుక్రవారం వారు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మందికి పైగా విద్యార్థులు మానసిక ఆందోళనకు గురయ్యారని, మూల్యాంకనంలో లోపాలతో అనుత్తీర్ణత సాధించారని తెలిపారు. ప్రతి విద్యార్థి తమ మార్కుల జాబితాపై అనుమానంతో ఉన్నారని, రీవాల్యుయేషన్‌కు ఎలాంటి ఫీజు లేకుండా అవకాశం కల్పించాలన్నారు. తుది ఫలితాలు వచ్చే వరకూ పది మార్కుల ఆధారంగా జరిగే అడ్మిషన్లను నిలిపివేయాలని కోరారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భువనేశ్వర్‌రెడ్డి, మణికంఠారెడ్డి, యూసఫ్‌ఖాన్, లోకనాథం, శివకుమార్, మొఘల్ ఫైజాన్‌బేగ్, సయ్యద్ ఫైజాన్, జగదీష్, షేక్ ఒబైజ్, షేక్ మహమ్మద్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.
13న వెలిగల్లు ఉద్యానవనంలో యోగాంధ్ర
గాలివీడు : ఈ నెల 13న వెలిగల్లు ఉద్యానవనంలో యోగాంధ్ర కార్యక్రమం ని ర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి హామీ పిడీ వెంకటరత్నం, టూరిజం అధికారి నాగ భూషణం తెలిపారు. మండల ఎంపీడీఓ జవహర్‌బాబుతో కలసి గాలివీడు మండలంలోని వెలిగల్లు ఉద్యానవన స్థలాన్ని శుక్రవారం వారు పరిశీలించారు. వారు మాట్లాడుతూ యోగా ద్వారా ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ప్రశాంతంగా జీవించగలరని అన్నారు. కార్యక్రమంలో ఏపీఓ హరిబాబు,తదితరులు పాల్గొన్నారు.
గంజాయి విక్రేతల అరెస్టు
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని దువ్వూరు రోడ్డులో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని ఎకై ్సజ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఎకై ్సజ్ అధికారులు తెలిపిన మేరకు.. గంజాయి విక్రయిస్తున్నారని సమాచారంతో ప్రొద్దుటూరు ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ సీవీ.సురేంద్రరెడ్డి, కడప ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ ఎం.నీలకంఠేశ్వరరెడ్డి, సిబ్బందితో కలిసి శుక్రవారం దాడులు నిర్వహించారు. దాడిలో హుస్సేన్ బాషా, సంతోష్, కార్తీక్‌లను అరెస్టు చేసి వారి నుంచి ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పది మూల్యాంకనంలో నిర్లక్ష్యం


