బీజేపీవి కక్ష సాధింపు చర్యలు
రాజంపేట రూరల్ : కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై రాజకీయ కుట్రలో భాగంగా బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గమని ఏపీసీసీ కార్యవర్గ సభ్యులు అత్తింజేరీ శ్రీనాథ్ ఆరోపించారు. స్థానిక ఆర్‌అండ్‌బీలో శుక్రవారం కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ ఎదుగుదలను జీర్ణించుకోలేక ప్రధాని మోదీ దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలను సొంత ఏజీన్సీలుగా వాడుకొంటూ అక్రమ కేసులు నమోదు చేయిస్తోందని మండిపడ్డారు. దేశంలో బీజేపీ చేస్తున్న అరచకాలను ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ గొంతు నొక్కాలని కుట్రలు చేయటం సబబు కాదని హితబోధ చేశారు. మనీనే లేని కేసులో మనీ ల్యాండరింగ్ జరిగిందని ఆరోపణలు చేయటం అత్యంత దారుణమని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ చేస్తున్న నీచ రాజకీయాలు ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. మోదీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ మీద చార్జీ షీట్ వేయటం కాదు ప్రజలే బీజేపీ మీద చార్జీషీట్ వేసే రోజులు దగ్గరపడ్డాయని గుర్తు చేశారు. సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి లింగం నాగేశ్వరరావు, డీసీసీఅ ధికార ప్రతినిధి అహమ్మద్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, వేంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఏపీసీసీ కార్యవర్గ సభ్యులు
అత్తింజేరీ శ్రీనాథ్


