ఆ లింకుల జోలికి వెళ్లొద్దు
మదనపల్లె : పండగల సందర్భంగా మోసగాళ్లు ఆఫర్ల పేరుతో మోసాలకు పాల్పడే అవకాశం ఉందని, వారి నుంచి వచ్చే వాట్సప్ లింకుల జోలికి వెళ్లొద్దని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రజలను కోరారు. ఆదివారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటనలో.. మోసాలు ఎలా చేస్తారో వివరించారు. పండగల ఆఫర్లు, ఉచిత బహుమతులు, భారీ డిస్కౌంట్ల పేరుతో సోషల్ మీడియాలో సందేశాలను పంపుతూ ఆకర్షితులయ్యేలా చేస్తారని అప్రమత్తం చేశారు. వీటిని నమ్మి ప్రజలు లింకులను తెరిస్తే సంబంధిత వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లోని నగదు ఖాళీ అవుతుందని హెచ్చరించారు.
ఆన్‌లైన్ షాపింగ్, ట్రావెల్ బుకింగ్‌లపై ప్రజలు ఆధారపడే పరిస్థితి ఉన్నందున ఆఫర్ల పేరుతో లింకులు పంపుతారని తెలిపారు. అలాగే పరిచయం లేని వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీలు కోరితే వివరాలు చెప్పవద్దని సూచించారు. ఒకవేళ మోసపోతే అలాంటి వ్యక్తులు మోసం జరిగినట్టు గుర్తించిన గంటలోపు 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. సకాలంలో బాధితులు అందిస్తే సాంకేతికత ఉపయోగించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
జిల్లా ఎస్పీ ధీరజ్


