657 కేజీల చౌక బియ్యం సీజ్
పీలేరు రూరల్ : అక్రమంగా తరలిస్తున్న 657 కేజీల చౌక బియ్యాన్ని సీజ్ చేసినట్లు ఎస్‌ఐ లోకేష్ తెలిపారు. శనివారం మండలంలోని శివరామ్‌పురం నుంచి పీలేరుకు వస్తున్న ఆటోను తనిఖీ చేయగా అందులో ఆరు బస్తాల చౌకబియ్యం ఉండడంతో ఆటోను అదుపులోకి తీసుకున్నారు. కలకడకు చెందిన అన్సారీ ,జోహర్‌లతోపాటు బియ్యాన్ని సీజ్ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
నీట మునిగి
ఉపాధ్యాయుడి మృతి
పీలేరు : తన కుమారుడికి ఈత నేర్పించడానికి వెళ్లి ప్రమాదవశాత్తు ఉపాధ్యాయుడు నీట మునిగి మృతి చెందిన సంఘటన పీలేరులో జరిగింది. నందకుమార్(50) అనే ఉపాధ్యాయుడు కేవీపల్లె మండలం మారెళ్ల పడమట పల్లె ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. పీలేరు పట్టణంలో నివాసముంటున్నారు. శనివారం తన కుమారుడికి ఈత నేర్పించడానికి పట్టణ సమీపంలోని బోడుమల్లువారిపల్లెకు వెళ్లారు. అక్కడ పొలాల వద్ద ఉన్న చెక్‌డ్యామ్‌లో నీళ్లు ఉండడంతొ నీళ్లలోకి దిగారు. అయితే ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి అక్కడే చనిపోయారు. జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టైరు పగిలి కారు బోల్తా
– తప్పిన పెను ప్రమాదం
నందలూరు : కడప–చైన్నె జాతీయ రహదారిలోని నందలూరు వద్ద శుక్రవారం రాత్రి చెయ్యేరు బ్రిడ్జిపైన టైరు పగలడంతో అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి పెను ప్రమాదం తప్పింది. ఖమ్మం నుంచి తిరుమలకు వెళ్తున్న తోటకూరి నరేష్ కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా టైరు పగిలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అందరూ స్వల్ప గాయాలతో బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 ద్వారా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ సంఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.
657 కేజీల చౌక బియ్యం సీజ్


