ప్రేమికుడి ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

ప్రేమికుడి ఆత్మహత్యాయత్నం

Sep 30 2023 12:58 AM | Updated on Sep 30 2023 10:58 AM

 చికిత్స పొందుతున్న హేమంత్‌   - Sakshi

చికిత్స పొందుతున్న హేమంత్‌

మదనపల్లె : ప్రేయసి మరణాన్ని జీర్ణించుకోలేక మనస్థాపం చెందిన ఓ ప్రేమికుడు బ్లేడ్‌తో గొంతు కోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం జరిగింది. ఇటీవల కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు పరిధిలోని సునకల్లు వద్ద అటవీ ప్రాంతంలో హర్షిత అనే యువతి అనుమానస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. పీలేరుకు చెందిన హర్షిత, ఈమె బంధువు కలికిరి మండలం గుట్టపాలెం పంచాయతీ వాడవాండ్లపల్లెకు చెందిన హేమంత్‌ (25) ప్రేమించుకున్నారు. వీరి మధ్య విభేదాలు రావడంతో హర్షిత ఇటీవల ఆత్మహత్య చేసుకోగా, కర్ణాటక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రియురాలి మరణాన్ని జీర్ణించుకోలేని హేమంత్‌ శుక్రవారం హర్షిత మరణించిన సునకల్లు అటవీ ప్రాంతానికి చేరుకుని సెల్‌ఫోన్‌ లైవ్‌ వీడియోలో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. సమాచారం అందుకున్న స్నేహితులు సంఘటనా స్థలానికి చేరుకుని హేమంత్‌ను 108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం అందించడంతో బాధితుడు కోలుకుంటున్నాడు. ఘటనపై రాయల్పాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement