వైభవం..పార్వేట ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

Feb 25 2023 8:56 AM | Updated on Feb 25 2023 3:15 PM

పారువేటకు బయలుదేరుతున్న శ్రీ వీరభద్రస్వామి   - Sakshi

పారువేటకు బయలుదేరుతున్న శ్రీ వీరభద్రస్వామి

రాయచోటిటౌన్‌ : రాయచోటి శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారు అశ్వవాహనంపై పారువేటకు వెళ్లారు. శుక్రవారం ఆలయ పాలక మండలి అధ్యక్షులు పోలంరెడ్డి విజయ, ఈవో డీవీ రమణారెడ్డి, మున్సిపల్‌ వైఎస్‌ చైర్మన్‌ పోలంరెడ్డి దశరథరామిరెడ్డిల ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు ఉత్సవ మూర్తులకు ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అశ్వవాహనంలో కొలువుదీర్చారు. పారువేటలో భాగంగా స్వామి వారు ఆలయ మాడవీధులలో ఊరేగారు. రవిహాల్‌ వెనుక భాగాన ఉన్న నాలుగు కాళ్ల మండపం వద్ద సంప్రదాయంగా కుందేలు విడిచి స్వామి వారు వేటాడినట్లుగా సంప్రదాయాన్ని పూర్తి చేస్తారు.

పార్వేట ఉత్సవానికి స్థానిక భక్తులు, కన్నడ భక్తులు తరలి వచ్చారు. అంతకు ముందు ఆలయంలో వేదపండితులు రాచరాయ యోగీ స్వామి, కృష్ణయ్య స్వామి, శంకరయ్య స్వామి ఆధ్వర్యంలోమహా సరస్వతీ పూజ నిర్వహించారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.

Advertisement
 
Advertisement
Advertisement