ఏపీ: ఈ నెల 26 నుంచి వైఎస్సార్‌సీపీ బస్సుయాత్ర

YSRCP Bus Tour From 26th Of This Month - Sakshi

సాక్షి, అమరావతి: బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు అధిక ప్రాధాన్యత నేపథ్యంలో ఈ నెల 26 నుంచి వైఎస్సార్‌ సీపీ బస్సు యాత్ర చేపట్టనుంది. సామాజిక న్యాయం పేరిట ఈ యాత్ర చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వ ఏవిధమైన ప్రాధాన్యత ఇస్తోందనేది ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. ఈ మేరకు  మొత్తం శ్రీకాకుళం,  అనంతపురం, రాజమండ్రి, నరసరావుపేట నాలుగు నియోజకవర్గాల్లో  బస్సు యాత్ర నిర్వహించి బహిరంగ సభలు  నిర్వహించనున్నారు. బీసీ, ఎస్టీ, ఎస్టీ మైనారిటీలకు చెందిన మొత్తం 17 మంత్రులు ఈ బస్సు యాత్రలో పాల్గొంటారు.

  • ఈ నెల  26న శ్రీకాకుళం లేదంటే విజయనగరంలో బహిరంగ సభ  
  • 27న రాజమండ్రిలో సభ  
  • 28న నరసరావుపేటలో బహిరంగ సభ.. ఆ రాత్రికి నంద్యాలలో బస,
  • 29న అనంతపురంలో బహిరంగ సభ

(చదవండి: తీరిన బొగ్గు కొరత.. ఏపీలో ఇక నిరంతరాయ విద్యుత్‌ సరఫరా)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top