వైఎస్సార్సీపీ నేత హత్య కేసు: రిమాండ్‌ ఖైదీ పరార్‌ | YSRCP Ganji Prasad Case Remand Accused Ravi Teja Abscond | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీ నేత గంజి ప్రసాద్‌ హత్య కేసు: రిమాండ్‌ ఖైదీ రవితేజ పరార్‌

Jun 24 2022 8:34 AM | Updated on Jun 24 2022 9:52 AM

YSRCP Ganji Prasad Case Remand Accused Ravi Teja Abscond - Sakshi

పోలీసుల కళ్లు గప్పి..  గంజి ప్రసాద్‌ హత్య కేసులో నిందితుడు పరార్‌ అయ్యాడు.

సాక్షి, ఏలూరు: వైఎస్సార్‌సీపీ నేత గంజి ప్రసాద్‌ హత్య కేసులో నిందితుడు ఒకడు పరారయ్యాడు. కేసులో 8వ నిందితుడిగా ఉన్న కోడూరి రవితేజ.. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి పారిపోయాడు.

గురువారం అర్దరాత్రి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రవితేజ తప్పించుకున్నాడు. ఏలూరు జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న కోడూరి రవితేజ.. నడుంనొప్పితో ఈ నెల 14వ తేదీన ఆస్పత్రిలో చేరాడు. 

అయితే.. అర్ధరాత్రి పోలీసుల కళ్లుగప్పి ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. తినే టైంలో.. బేడీలు తొలగించడంతోనే పరారైనట్లు సెంట్రీ సిబ్బంది వెల్లడించారు. ప్రస్తుతం రవితేజ కోసం గాలింపు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement