పేదలకు మా ప్రభుత్వం అండగా నిలిచింది: సీఎం జగన్‌

Ysr Pension Kanuka: CM Jagan Rajahmundry Tour Live Updates - Sakshi

12:34PM

సీఎం జగన్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

  • పేదలకు మా ప్రభుత్వం అండగా నిలిచింది: సీఎం జగన్‌
  • పెన్షన్‌ను నెలకు రూ. 2,750కి పెంచాం
  • 64 లక్షల మంది కుటుంబాలకు పెన్షన్‌ అందిస్తున్నాం
  • పెన్షన్లు పెంచుతూ పోతామన్న హామీని నిలబెట్టుకున్నాం
  • ఈ స్థాయిలో పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ
  • అర్హులకు బియ్యం కార్డులు, ఆరోగ్య శ్రీ కారుడు, ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం
  • 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చాం
  • గత ప్రభుత్వంలో కేవలం రూ. వెయ్యి మాత్రమే పెన్షన్‌ ఇచ్చేవారు
  • గత ప్రభుత్వంలో కేవంల 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్‌
  • మేం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్‌దారుల సంఖ్య పెరిగింది
  • పెన్షన్‌ కోసం నెలకు రూ. 1765 కోట్లు ఖర్చు చేస్తున్నాం
  • మూడున్నరేళ్లలో పెన్షన్ల కోసం రూ. 62, 500 కోట్లు ఖర్చే చేశాం
  • గతంలో మాదిరిగా ఎక్కడా వివక్ష లేదు, లంచాలు లేవు
  • అవ్వా తాతలు, అక్క చెల్లెమ్మలు ఆనందంగా పెన్షన్‌ పొందుతున్నారు
  • రూ. 2,750 నుంచి రూ. 10 వేల వరకూ పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ
  • అర్హత ఉన్న లబ్ధిదారులందరికీ పెన్షన్‌ ఇస్తున్నాం
  • గత ప్రభుత్వంలో నెలకు పెన్షన్ల ఖర్చు కేవలం రూ. 400 కోట్లు
  • మా ప్రభుత్వంలో నెలకు పెన్షన్లకే రూ. 1,765 కోట్లు ఇస్తున్నాం

  • గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో 29 మందిని బలి తీసుకున్నారు
  • కందుకూరులో జనం ఎక్కువగా వచ్చినట్లు చూపించే ప్రయత్నం చేశారు
  • జనం తక్కువగా వచ్చారని కందుకూరు ఇరుకు రోడ్డులో సభపెట్టారు
  • చిన్నసందులో జనాల్ని నెట్టి 8 మందిని చంపింది చంద్రబాబే
  • డ్రోన్‌ షాట్ల కోసం కందుకూరు సభలో 8 మందిని చంపేశారు
  • గుంటూరు సభలో ముగ్గురిని పొట్టన పెట్టుకున్నారు
  • తానే మనుషులను చంపేసి మానవతావాదిలా డ్రామాలాడతాడు
  • షోటోషూట్‌ కోసం, డ్రోన్‌ షాట్‌ల కోసం చంద్రబాబు వెంపర్లడతారు
  • మనుషులను చంపేసిసా ఈనాడు, ఏబీఎన్‌, టీవీ5, దత్తపుత్రుడు అడగరు
  • ఎన్టీఆర్‌ పార్టీని, ట్రస్ట్‌ను చంద్రబాబు లాక్కున్నారు
  • ఎన్నికల్లో మాత్రం ఎన్టీఆర్‌ ఫోటోకు దండలు వేస్తాడు
  • ఫోటోషూట్‌, డ్రామాలే చంద్రబాబు నైజం
  • పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని కేసులు వేస్తున్నారు
  • పేదవాడికి ఇంగ్లిష్‌ మీడియం చదువులు వద్దన్నారు
  • రాష్ట్రంలో జరుగుతుంది కులాల యుద్ధం కాదు.. పేదవాడికీ, పెత్తందారి వ్యవస్త మధ్య యుద్ధం జరుగుతోంది
  • నేను ప్రజలనే నమ్ముకున్నా

12:27PM

సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
‘గత ప్రభుత్వం హయాంలో నా భర్త చనిపోయాడు. నాకు ఇద్దరు పిల్లలు. భర్త చనిపోవడంతో రోడ్డుమీద పడ్డ నన్ను ఎవరూ పట్టించుకోలేదు. గత ప్రభుత్వం హయాంలో జన్మభూమి కమిటీలో నేను తిరగని రోజే లేదు. రోజూ వెళ్లి చెట్లకింద కూర్చుని పెన్షన్‌ దరఖాస్తు చేశాను. ఎవరూ మమ్మల్నీ పట్టించుకోలేదు. తిరిగి తిరిగి విసుగొచ్చి మేమే మానుకున్నాం. ఎప్పుడైతే మీరు సీఎం అయ్యారో, ఎప్పుడైతే మన ప్రభుత్వం వచ్చిందే.. వాలంటీరు నేరుగా మా ఇంటికే వచ్చారు.

వితంతు పెన్షన్‌కు నేను దరఖాస్తు చేసుకున్నాను. ఏడాదిన్నర తిరిగితే రాని పెన్షన్‌ ఒక్క నెలకే వచ్చింది. ప్రతి నెల 1వ తేదీన వాలంటీరు వచ్చి మా చేతిలే పెన్షన్‌ డబ్బులు పెడుతుంటే పండగలాగా అనిపిస్తోంది’ అని తనకు అందుతున్న సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుని సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 
- సంక్షేమ పథకాల లబ్ధిదారు కోటా సామ్రాజ్యం 

12:16PM

ఎంపీ మార్గాని భరత్‌ స్పీచ్‌

  • బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి.. మన అందరి ప్రియతమ దేవుడిచ్చిన ముఖ్యమంత్రి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గారికి స్వాగతం అంటూ ఎంపీ భరత్‌ తన ప్రసంగాన్ని ఆరంభించారు.
  • జనవరి 1వ తేదీ ప్రపంచం మొత్తం పండుగ
  • జనవరి 2వ తేదీ వైకుంఠ ఏకాదశి తెలుగు ప్రజలందరికీ పండుగ
  • ఈరోజు( జనవరి3వ తేదీ, మంగళవారం) అవ్వా-తాతల పండుగను రాజమహేంద్రవరంలో జరుపుకోవడానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇక్కడకి రావడం మూడో పండుగ. 
  • తండ్రి ఆశయాల్ని ముందుకు తీసుకెళుతున్న వ్యక్తి  సీఎం జగన్‌
  • దేశంలో అత్యంత శక్తిమంతురాలైన సోనియా గాంధీని సైతం లెక్క చేయకుండా ఢిల్లీ కోటలు బద్దలయ్యేలా సింహంలా గర్జించిన వ్యక్తి సీఎం జగన్‌ అని ఈరోజు తెలియజేస్తున్నా
  • అవ్వా-తాతల్ని ఎంతో ప్రేమగా పలకరించే వ్యక్తి సీఎం జగన్‌
  • అవ్వా బాగున్నావా.. తాతా బాగున్నావా.. అమ్మా బాగున్నావా.. అని ఆప్యాయత చూపించే వ్యక్తి మన సీఎం జగన్‌
  • అలా పలకరించడంలో ఆనాడు స్వర్ణయుగంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారిని చూశాం.. ఈరోజు మన జగన్‌మోహన్‌రెడ్డి గారిని చూస్తున్నాం
  • గత ప్రభుతంలో చంద్రబాబు వెయ్యి రూపాయల పింఛన్ మాత్రమే ఇచ్చేవాడు
  • అది కూడా కేవలం 39 లక్షల మందికి మాత్రమే ఇచ్చేవాడు
  • ఆ పెన్షన్‌ కాస్తా ఇప్పుడు 2,750 చేశారు మన సీఎం జగన్‌
  • అది కూడా సుమారు 64 లక్షల మందికి పెన్షన్‌ ఇస్తున్నారు
  • అలా రికార్డు స్థాయిలో పెన్షన్లు ఇవ్వడం ఏపీలో మాత్రమే జరుగుతుంది

11:55AM
వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక లబ్ధిదారులతో సీఎం జగన్‌ ముఖాముఖి
పెన్షన్‌ పెంపు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌


రాజమండ్రిలో మున్సిపల్ గ్రౌండ్స్‌కు సీఎం జగన్‌

11:08AM
జాంపేట ఆజాద్ చౌక్  సెంటర్ కు చేరుకున్న సిఎం జగన్ రోడ్డు షో
సీఎం జగన్‌కు భారీ స్వాగతం పలికిన ప్రజలు

సీఎంకు స్వాగతం పలికిన మంత్రులు విశ్వరూప్, వేణుగోపాలకృష్ణ, ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు, అధికారులు

11:00AM
రాజమండ్రి చేరుకున్న సీఎం జగన్‌

10: 27AM
రాజమండ్రి బయల్దేరిన సీఎం జగన్‌

పెన్షన్‌ పెంపు నిర్ణయంతో లబ్ధిదారుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ(మంగళవారం) తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. 

వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించి.. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. 

రాష్ట్రవ్యాప్తంగా రూ. 2,750 పెన్షన్‌ పెంపుతో లబ్ధిదారుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు జిల్లాకు 9,147 అదనపు పెన్షన్లు మంజూరు అయ్యాయి. ఈ నేపథ్యంలో.. ఆయన అక్కడి లబ్ధిదారుల మనోభావాలను తెలుసుకోనున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ లబ్ధి చేకూరే విధంగా పెన్షన్ వారోత్సవాలు ప్రకటించనున్నారాయన.

మరోవైపు గత రెండు రోజులుగా పెన్షన్‌ పెంపు వారోత్సవాల కోలాహలం కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు స్వయంగా ఇందులో పాల్గొంటున్నారు కూడా. ఇక సీఎం వైఎస్‌ జగన్‌ రాక సందర్భంగా రాజమండ్రిలో భారీ ఏర్పాట్లు ఏర్పాటు చేశారు. మున్సిపల్ గ్రౌండ్‌ వద్ద హెలిపాడ్ ఏర్పాటు చేశారు. భారీ బహిరంగ సభ జరిగే ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో  పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top