రేపు వైఎస్సార్ జీవిత సాఫల్య, సాఫల్య అవార్డుల ప్రకటన

YSR Birth Anniversary AP Government Will Give YSR Lifetime Award - Sakshi

వ్యవసాయం, కళలు, సంస్కృతి, సాహిత్యం మొదలైన కేటగిరీలకు అవార్డు    

విశిష్ట సేవలు అందించిన కోవిడ్ వారియర్స్ కు, అసామాన్య ప్రతిభ కనబర్చిన సామాన్యులకూ పురస్కారాలు

వైఎస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు క్రింద రూ.10 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ, మెడల్, శాలువ బహుకరణ

వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డు క్రింద రూ. 5 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ, మెడల్, శాలువ బహుకరణ

సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వ్యక్తులకు వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య పురస్కారాలను ఇవ్వనుంది. ఈ నెల 7వ తేదీన అవార్డులు ప్రకటిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవార్డుల హైపవర్ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు, రాష్ట్ర కమ్యూనికేషన్ల సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ రేపు మధ్యాహ్నం ప్రకటించనున్నారు.

వ్యవసాయం, కళలు, సంస్కృతి, సాహిత్యం మొదలైన కేటగిరీలకు అవార్డుల్లో ప్రభుత్వం పెద్దపీట వేసింది. విశిష్ట సేవలు అందించిన కోవిడ్ వారియర్స్ తో పాటు అసామాన్య ప్రతిభ కనబర్చిన సామాన్యులకు కూడా ప్రభుత్వం పురస్కారాలు అందజేయనుంది. వైఎస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు క్రింద రూ.10 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ, మెడల్ (జ్ఞాపిక), శాలువ బహుకరిస్తారు. వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డు క్రింద రూ. 5 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ, మెడల్ (జ్ఞాపిక), శాలువ బహుకరిస్తారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top