
రత్నయ్యకు కొత్త పింఛన్ అందిస్తున్న సత్యనారాయణరెడ్డి తదితరులు
సాక్షి, పెళ్లకూరు(తిరుపతి జిల్లా): పార్టీటలకు అతీతంగా పారదర్శకమైన పాలన అందిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా మరో 30 ఏళ్ల పాటు కొనసాగాలని పెళ్లకూరు టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు బత్తిన రత్నయ్యనాయుడు ఆకాంక్షించారు.
ఆయన 1985లో టీడీపీ పెళ్లకూరు మండల అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవల స్వగ్రామానికి చేరుకుని ఇంటి వద్ద ఉంటున్నారు. గ్రామ వలంటీర్, సచివాలయ సిబ్బంది నేరుగా ఇంటికి వెళ్లి పలకరించడంతో ఆయన తన వయస్సు 70 ఏళ్లు అని చెప్పడం, దానికి సంబంధించిన ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచిన వెంటనే కొత్తగా పింఛన్ మంజూరైంది.
పెళ్లకూరు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం కొత్తగా పింఛన్లు మంజూరైన వారికి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా బత్తిన రత్నయ్య నాయుడు కూడా పింఛన్ అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సీఎం జగన్ పారదర్శకమైన పాలన అందిస్తున్నారని కొనియాడారు.
చదవండి: (Graduates MLC: పట్టం కట్టేదెవరికి.. పాఠం కలిసొచ్చేదెవరికి?)