నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్‌ జగన్‌ | YS Jagan Palnadu Rentapalla Visit Updates | Sakshi
Sakshi News home page

నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్‌ జగన్‌

Jun 18 2025 9:53 AM | Updated on Jun 18 2025 6:45 PM

YS Jagan Palnadu Rentapalla Visit Updates

రెంటపాళ్లలో వైఎస్‌ జగన్‌

  • రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమల్లో కూటమి సర్కార్‌ ముందుంది: వైఎస్‌ జగన్‌
  • ఏపీలో అభివృద్ధి, సంక్షేమం లేదు..
  • రెడ్‌ బుక్‌ రాజ్యాంగం మాత్రమే ఉంది
  • రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని అనడానికి ప్రభుత్వ ఆంక్షలు నిదర్శనం
  • పోలింగ్‌ సమయంలో వారి ఇష్టమైన అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చుకున్నారు
  • 2024, జూన్‌ 4న కౌంటింగ్‌ రోజునే నాగమల్లేశ్వరరావును పీఎస్‌కు తీసుకెళ్లారు
  • ఫలితాలు వచ్చిన రోజునే నాగమల్లేశ్వరరావును పీఎస్‌లో ఉంచారు
  • నాగమల్లేశ్వరరావు ఇంటిపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడి చేశారు
  • నాగమల్లేశ్వరరావును కాల్చి చంపుతామని సీఐ రాజేష్‌ బెదిరించారు
  • గ్రామం విడిచి వెళ్లిపోవాలని సీఐ రాజేష్‌  బెదిరించారు
  • గ్రామం విడిచి వెళ్లకపోతే రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తామన్నారు
  • పోలీస్‌స్టేషన్‌లో నాగమల్లేశ్వరాను అవమానించారు

నాగమల్లేశ్వరరావు ఇంటికి వైఎస్‌ జగన్‌

  • రెంటపాళ్లలో వైఎస్సార్‌సీపీ నేత నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్‌ జగన్‌

  • కూటమి అరాచక పాలనలో బలైన తొలి వైఎస్సార్‌సీపీ నేత నాగమల్లేశ్వరరావు

  • పోలీసులు, టీడీపీ నేతలతో బలవన్మరణానికి పాల్పడ్డ నాగమల్లేశ్వరరావు

  • బాధిత కుటుంబానికి జగన్‌ పరామర్శ

ఇసకేస్తే రాలనంత..

  • జగన్‌ రాక నేపథ్యంలో జనసంద్రమైన రెంటపాళ్ల

  • భారీ గజమాలతో స్వాగతం పలికిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు

  • రెంటపాళ్లలో పార్టీ జెండా ఆవిష్కరించిన వైఎస్‌ జగన్‌

  • మరికాసేపట్లో నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ

రెంటపాళ్ల చేరుకున్న వైఎస్‌ జగన్‌

  • సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల చేరుకున్న వైఎస్‌ జగన్‌

  • పోటెత్తిన అభిమానుల నడుమ ఆరు గంటల ఆలస్యంగా పర్యటన

  • పోలీసులు, టీడీపీ నేతల వేధింపులతో కిందటి ఏడాది ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు

  • నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణలో పాల్గొనున్న జగన్‌

  • నాగమల్లేశ్వరావు కుటుంబానికి జగన్‌ పరామర్శ

  • జగన్‌ పర్యటన నేపథ్యంలో పచ్చదండు విష ప్రచారం

  • బెట్టింగ్‌ వల్ల చనిపోయాడంటూ నాగమల్లేశ్వరరావు మీద పోస్టులు, వీడియోలు 

    పూర్తి కథనం కోసం 👉నాగమల్లేశ్వరరావు మృతి: నాడు జరిగింది ఇదే..

  • విగ్రహం వద్ద కంటతడి పెట్టిన నాగమల్లేశ్వరరావు తల్లి

  • పరామర్శకు అనుమతి ఉందంటూ.. పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టిన నాగమల్లేశ్వరరావు తండ్రి

  • ఆంక్షల నడుమే రెంటపాళ్లకు భారీగా చేరుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు

సత్తెనపల్లి గడియారం సెంటర్‌కు చేరుకున్న వైఎస్‌ జగన్  

  • సత్తెనపల్లి గడియారం సెంటర్‌కు చేరుకున్న వైఎస్‌ జగన్  
  • వెల్లువులా వచ్చిన ప్రజలు.. జనసంద్రంలా మారిన సత్తెనపల్లి
  • వైఎస్‌ జగన్‌కు గజమాలతో స్వాగతం పలికిన కార్యకర్తలు, అభిమానులు

జన ప్రభంజనమైన సత్తెనపల్లి

  • కిలోమీటర్ల పొడవునా జనం.. జనం
  • ఇసుకేస్తే రాలనంతగా తరలివచ్చిన జనం
  • బైకులు, కార్లలో భారీగా వచ్చిన వైఎస్సార్ సీపీ కేడర్
  • జగన్‌ను చూసేందుకు రోడ్డు పక్కన బిల్డింగులు ఎక్కిన జనం
  • జగన్‌పై అభిమానాన్ని అడ్డుకోలేక పోయిన ప్రభుత్వ ఆంక్షలు
  • పోలీసుల చెక్ పోస్టులు దాటుకుని రెంటపాళ్ల వైపు కదులుతున్న జనం
  • ఇప్పటికే వేలాదిమందితో నిండిపోయిన రెంటపాళ్ల
  • సత్తెనపల్లి నుండి రెంటపాళ్ల వరకు జనమే జనం 

మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పోలీసుల వాగ్వాదం:

  • మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పోలీసుల వాగ్వాదం

  • పల్నాడు సరిహద్దుల్లో భారీ ఎత్తున బారీకేడ్లు అడ్డుపెట్టిన పోలీసులు 

  • వాహనాలు,కార్యకర్తల్ని  అడ్డుకుంటున్న పోలీసులు 

  • బారికేడ్లను తొలగించాలని పోలీసుల్ని కోరిన అంబటి రాంబాబు 

  • బారికేడ్లు తొలిగించేది లేదని పోలీసుల ఓవరాక్షన్‌ 

  • అంబటి రాంబాబుతో వ్వాగాదానికి దిగిన పోలీసులు 

 

పల్నాడు..

  • పల్నాడు జిల్లాలోకి వైఎస్‌ జగన్
  • ప్రభంజనంగా మారిన పల్నాడు ఎంట్రన్స్
  • కంటెపూడి వద్ద జనసందోహం
  • వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికిన పల్నాడు ప్రాంత మాజీ ఎమ్మెల్యేలు
  • గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి, నంబూరు శంకర్రావు, బొల్లా బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి ఇన్ఛార్జి గజ్జల సుధీర్ స్వాగతం..
  • పార్టీ కార్యకర్తలతో కిటకిటలాడుతున్న కంటెపూడి

 

మేడికొండూరు చేరుకున్న వైఎస్ జగన్

  • భారీగా తరలివచ్చిన తాడికొండ నియోజకవర్గ కార్యకర్తలు
  • మండుతున్న ఎండలోనూ జగన్ కోసం ఎదురు చూస్తున్న మహిళలు, వృద్దులు
  • భారీ బైకు ర్యాలీతో జగన్ కాన్వాయ్ ని తీసుకెళ్తున్న యూత్

పల్నాడు..

  • పల్నాడు జిల్లాలోకి ఎంటరైన వైఎస్ జగన్
  • పేరేచర్ల జంక్షన్‌కు చేరుకున్న జగన్ కాన్వాయ్
  • భారీ జనసందోహంతో కిటకిటలాడుతున్న పేరేచర్ల
  • జై జగన్, జైజై జగన్ నినాదాలతో మార్మోగుతున్న జంక్షన్
  • అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్న జగన్

జగన్ పర్యటనలో కనపడని పోలీసులు!

  • వైఎస్‌ జగన్‌ పల్నాడు రెంటపాళ్ల పర్యటన
  • పోలీసులమయంగా సత్తెనపల్లి నియోజకవర్గం
  • ఆంక్షల పేరుతో వైఎస్సార్‌సీపీ కేడర్‌ను ఇబ్బంది పెట్టిన పోలీసులు
  • కానీ.. జగన్‌ పర్యటనలో కనబడని పోలీసులు
  • జగన్‌ కాన్వాయ్‌కు రోడ్ క్లియర్ చేయని పోలీసులు
  • మాజీ సీఎం హోదాలో జడ్ ప్లస్ భద్రతలో ఉన్న జగన్
  • జగన్ కాన్వాయ్ కి ముందు కనపడని రోప్ పార్టీ, రోడ్ క్లియరెన్స్ పార్టీ
  • కాన్వాయ్ తో వస్తున్న పోలీసు వాహనాలు తప్ప రోడ్డుపై కనపడని ఖాకీలు
  • జగన్ కాన్వాయ్‌కి ముందు పరిగెత్తుతూ రోడ్ క్లియర్ చేస్తున్న ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ మంత్రి పేర్ని నాని
     
  • గుంటూరు శివారు నల్లపాడు చేరుకున్న వైఎస్ జగన్
  • జైజగన్ నినాదాలతో మార్మోగుతున్న నల్లపాడు
  • మహిళలు, కార్యకర్తలతో కిటకిటలాడుతున్న నల్లపాడు

 

  • మిర్చి మార్కెట్ యార్డు దగ్గరకు చేరుకున్న వైఎస్ జగన్ కాన్వాయ్
  • పూలు చల్లుతూ అభిమానం చాటుకుంటున్న కేడర్

జనసంద్రం నడుమ నెమ్మదిగా..

  • కార్యకర్తలతో కిటకిటలాడుతున్న గుంటూరు రోడ్లు
  • అడుగడుగునా ఉప్పొంగుతున్న అభిమాన సంద్రం
  • చుట్టుగుంట సెంటర్‌లో జగన్‌కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
  • గుంటూరులోకి ఎంటరై గంటన్నర అవుతున్నా ముందుకు సాగని వైఎస్‌ జగన్‌ కాన్వాయ్
  • వై జంక్షన్, ఏటుకూరు రోడ్, లాల్‌పురం రోడ్డు మీదుగా చుట్టుగుంట సెంటర్ కి చేరుకున్న జగన్
  • మహిళలు, పార్టీ కేడర్‌తో రోడ్లన్నీ ఫుల్

రెంటపాళ్లకు భారీగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు

  • పల్నాడులో పోలీసుల దౌర్జన్యకాండ

  • జగన్‌ పర్యటన నేపథ్యంలో భారీ ఆంక్షలు

  • వైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నం

  • అయినా రెంటపాళ్లకు భారీగా చేరుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు

  • పోలీసుల ఆంక్షల వలయాలను దాటుకుని రెంటపాళ్లకు చేరుకున్న అభిమానులు, కార్యకర్తలు

  • జగన్‌ వెంటే జనం అని మరోసారి రుజువు

చంద్రబాబుగారూ.. ఇది కరెక్ట్‌కాదు: ఆర్కే రోజా

  • జగన్‌ పర్యటనలో ఆంక్షలపై మాజీ మంత్రి రోజా స్పందన

  • సీఎం చంద్రబాబుకు సూటి ప్రశ్న

  • గతంలో మీ కార్యకర్తల కుటుంబాలను ప్రశ్నించలేదా?

  • ఆంక్ష‌లు పెట్టి ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన నాయ‌కుడిని అడ్డుకోవాల‌ని చూడ‌డం ఏ మాత్రం క‌రెక్టు కాదు 

 

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పోలీసుల ఓవరాక్షన్‌

  • సత్తెనపల్లిలో భారీగా చెక్ పోస్టుల ఏర్పాటు 
  • జగన్‌ కాన్వాయ్‌ వెంట భారీగా తరలి వచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
  • బైకులను అనుమతించకుండా అడ్డుకున్న పోలీసులు
  • పోలీసులతో పార్టీ కేడర్‌ వాగ్వాదం

గుంటూరులో జగన్‌కు ఘన స్వాగతం

  • గుంటూరు నగరంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్ కాన్వాయ్‌
  • గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి నూరి ఫాతిమా ఆధ్వర్యంలో ఘన స్వాగతం
  • భారీగా బైక్ ర్యాలీతో వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికిన కార్యకర్తలు
  • జై జగన్ నినాదాలతో జన సందోహంగా మారిన లాల్‌పురం రోడ్డు

అడుగడుగునా ఆంక్షలు, అయినా..

  • సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో పోలీసుల అతి
  • జగన్‌ పర్యటన నేపథ్యంలో మునుపెన్నడూ లేనిరీతిలో ఆంక్షలు
  • నరసరావుపేట, మాచర్ల, గుంటూరు వైపు నుంచి సత్తెనపల్లి వైపు వాహనాలు వెళ్లనీయకుండా టాటంకాలు
  • రెంటపాళ్ల ఊరిలోకి స్థానికేతరులను రానీయకుండా అడ్డుకుంటున్న పోలీసులు
  • ఆధార్‌ కార్డు చూపిస్తేనే అనుమతిస్తున్న వైనం
  • గ్రామస్తులకు సైతం ఆధార్‌ కార్డు తప్పనిసరి చేసిన పోలీసులు
  • అయినా రెంటపాళ్ల వైపు అడుగులేస్తున్న అభిమానం
  • జగన్‌ కోసం పోటెత్తుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు
  • కాలినడకన అయినా సరే రెంటపాళ్లకు చేరుకోవాలనే ప్రయత్నం

ప్రజాభిమానం నడుమ ముందుకు సాగుతూ..

  • గుంటూరు శివారు ఏటుకూరు రోడ్డుకు చేరుకున్న వైఎస్ జగన్
  • పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి ఎంటర్ అయిన జగన్
  • ఇన్ఛార్జి బలసాని కిరణ్ ఆధ్వర్యంలో జగన్‌కు భారీ స్వాగతం పలికిన వైఎస్సార్‌సీపీ కేడర్
  • సత్తెనపల్లి రెంటపాళ్ల వైపు నెమ్మదిగా సాగుతున్న కాన్వాయ్‌
  • దారిపొడవునా ఘన స్వాగతం పలుకుతున్న అభిమానులు
  • మధ్యలో బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేస్తున్న జననేత

దారిపొడవునా అభిమానమే..  

  • వైఎస్‌ జగన్‌ పల్నాడు పర్యటన
  • గుంటూరు వై జంక్షన్ చేరుకున్న వైఎస్ జగన్
  • అడుగడుగునా అపూర్వ స్వాగం
  • పార్టీ అధినేతకు స్వాగతం పలికిన పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జి అంబటి మురళీ
  • భారీగా తరలివచ్చిన కార్యకర్తలు
  • దారిపొడవునా జై జగన్‌.. జైజై జగన్‌ నినాదాలు
  • ఏ రోడ్డు చూసినా జగన్‌కు ఉప్పొంగిన అభిమానం
  • దారిపొడవునా.. ఇరువైపులా బారులు తీరిన జనం
  • మార్గమధ్యలో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్న జగన్‌

మరికాసేపట్లో పల్నాడు రెంటపాళ్లకు వైఎస్‌ జగన్‌

  • వైఎస్‌ జగన్‌ పల్నాడు జిల్లా పర్యటన

  • పోలీసులు, టీడీపీ నేతల వేధింపులతో బలన్మరణానికి పాల్పడ్డ వైఎస్సార్‌సీపీ నేత నాగమల్లేశ్వరరావు

  • నాగమల్లేశ్వరరావు కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ

  • నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న వైఎస్‌ జగన్‌

  • జగన్‌ పర్యటనపై పచ్చ కుట్రలు

  • పర్యటనను ఎలాగైనా అడ్డుకునేందుకు ఆంక్షల పేరుతో పోలీసు యంత్రాంగ ప్రయోగం

  •  వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేస్తున్న వైనం

పోలీసుల వైఖరి సరికాదు: నాగమల్లేశ్వరరావు తండ్రి

  •  పోలీసుల వైఖరిని తప్పు బట్టిన నాగమల్లేశ్వరరావు తండ్రి కొర్లకుంట వెంకటేశ్వరరావు

  • మా బంధువులను కూడా అడ్డుకుంటున్నారు

  • పరామర్శకు అనుమతి తీసుకున్నారు

  • మీ కాళ్లు పట్టుకుంటా.. కనీసం మా వాళ్లనైనా అనుమతించండి

ఆంక్షలను లెక్కచేయకుంలడా.. 

  • జగన్‌ కోసం జనం
  • పల్నాడు రెంటపాళ్ల పర్యటనకు భారీగా కదిలి వస్తున్న పార్టీ శ్రేణులు, అభిమానులు
  • పోలీస్‌ ఆంక్షలను లెక్కచేయకుండా ముందుకు సాగుతున్న వైనం
  • పొలాల గుండా రెంటపాళ్లకు బయల్దేరిన కార్యకర్తలు, అభిమానులు 
  • బైకుల మీద, నడుచుకుంటూ రెంటపాళ్ల వైపు
  • ఆధార్‌ కార్డులు చూపించాలంటూ రెంటపాళ్ల గ్రామస్తులపైనా పోలీసుల ఒత్తిడి
  • రెంటపాళ్ల చుట్టూ.. 20 చెక్‌పోస్టులు పెట్టారు. 
  • ప్రతీ రెండు కిలోమీటర్‌కు ఓ చెక్‌పోస్టు
  • పోలీసుల వైఖరిని గ్రామస్తుల ఆగ్రహం

 

  • తాడేపల్లి నివాసం నుంచి రెంటపాళ్లకు బయల్దేరిన వైఎస్‌ జగన్‌
  • జగన్‌ వెంట బైకులు, కార్లలో పార్టీ నేతలు, కార్యకర్తలు 
  • వైఎస్‌ జగన్‌ వెంటే.. భారీ సంఖ్యలో ముందుకు కదిలిన వైనం

 
పోలీస్‌మయంగా మారిపోయిన పల్నాడు

  • పల్నాడులో ఇవాళ వైఎస్‌ జగన్‌ పర్యటన

  • సత్తెనపల్లి రెంటపాళ్లకు వైఎస్సార్‌సీపీ అధినేత 

  • పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఉపసర్పంచ్‌, వైఎస్సార్‌సీపీ నేత  నాగమల్లేశ్వరరావు

  • బాధిత కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ

  • జగన్‌ పల్నాడు పర్యటనకు పోలీసుల ఆంక్షలు

  • పోలీసు మయంగా మారిన పల్నాడు జిల్లా

  • సత్తెనపల్లిలో భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు

  • వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ఆంక్షలు

  • జగన్‌ పర్యటనలో పాల్గొనవద్దని నోటీసులు.. పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు

  • జగన్‌ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వ కుట్రలు

👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement