
గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. 31వ తేదీ ఉదయం 9.30 గంటలకు బెంగళూరు యలహంకలోని తన నివాసం నుంచి బయలుదేరి 9.50 గంటలకు జక్కూరు ఏరోడ్రమ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 11 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 11.10 గంటలకు కడప ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి పెండ్లిమర్రి మండంలోని మాచునూరు గ్రామానికి చేరుకొని అక్కడ ఇటీవల మృతిచెందిన వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మాచునూరు చంద్రారెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు.
మధ్యా హ్నం పార్టీ నేతలను కలుసుకుంటారు. 12.30 గంటలకు మాచునూరు గ్రామం నుంచి బయలుదేరి ఒంటిగంటకు గొందిపల్లె గ్రామానికి చేరుకుంటారు. ఇటీవల కడప మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాచవరం చంద్రహాసరెడ్డి కుమార్తె వివాహం జరిగిన నేపథ్యంలో వారి స్వగృహానికి వెళ్లి వధూవరులను ఆశీర్వదిస్తారు. 1.30 గంటలకు గొందిపల్లె నుంచి బయలుదేరి 2.15 గంటలకు పులివెందులలోని తన నివాసానికి చేరు కుంటారు. 1వతేదీ ఉదయం 9 గంటల నుంచి పులివెందుల క్యాంప్ ఆఫీసులో ప్రజలకు, పార్టీ నేతలకు అందుబాటులో ఉంటారు.
2వ తేదీ తెల్లవారుజామున 6.20 గంటలకు పులివెందులలోని తన నివాసం నుంచి బయలుదేరి 7 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుంటారు. వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ప్రార్థనంలు నిర్వహించి, 7.30 గంటలకు అక్కడి నుంచి బయలు దేరి 7.35 గంటలకు ఇడుపులపాయ లోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 9.25గంటలకు తాడేపల్లి హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 9.40 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
