హేమంత్‌ సోరేన్‌.. మీరంటే ఎంతో గౌరవముంది: సీఎం జగన్‌ | YS Jagan Mohan Reddy Responds Over Jharkhand CM Hemant Soren Tweet | Sakshi
Sakshi News home page

హేమంత్‌ సోరేన్‌.. మీరంటే ఎంతో గౌరవముంది: సీఎం జగన్‌

May 7 2021 4:34 PM | Updated on May 7 2021 4:48 PM

YS Jagan Mohan Reddy Responds Over Jharkhand CM Hemant Soren Tweet - Sakshi

సాక్షి, అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీపై జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌ చేసిన ట్వీట్‌పై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. శుక్రవారం ట్విటర్‌ వేదికగా ‘‘ హేమంత్‌ సోరేన్‌.. మీరంటే ఎంతో గౌరవముంది. రాజకీయంగా పార్టీల మధ్య విభేదాలుండొచ్చు కానీ... విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు దేశాన్ని బలహీనం చేస్తాయి. కరోనా వేళ రాజకీయాలొద్దు. కోవిడ్‌-19పై చేస్తోన్న యుద్ధంలో మనమంతా ఏకమవ్వాలి. ఈ సమయంలో ప్రధానిని నిందించే బదులు... పార్టీలకు అతీతంగా కోవిడ్‌పై పోరాటాన్ని బలోపేతం చేద్దా’’మని పేర్కొన్నారు.

హేమంత్‌ సోరేన్‌ తన ట్వీట్‌లో.. ‘‘ ఈ రోజు ఆదర్శ ప్రాయుడైన ప్రధాని నరేంద్ర మోదీ నాకు ఫోన్‌ చేశారు. ఆయన కేవలం తన మనసులోని మాటే చెప్పారు. ఆయన తను మాట్లాడటమే కాకుండా, నేను చెప్పేది కూడా వినుంటే బాగుండేది’’ అని అన్నారు.

చదవండి : ధాన్యం సేకరణలో మిల్లర్ల ప్రమేయం వద్దు: సీఎం జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement