అప్పులపై ఇన్నిరోజులూ పచ్చి అబద్ధాలే..! | yellow media blatant lie on Debt issue of YSRCP Govts Deb: Andhra pradesh | Sakshi
Sakshi News home page

అప్పులపై ఇన్నిరోజులూ పచ్చి అబద్ధాలే..!

Nov 12 2024 4:06 AM | Updated on Nov 12 2024 4:06 AM

yellow media blatant lie on Debt issue of YSRCP Govts Deb: Andhra pradesh

అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర అప్పులు రూ.6.4 లక్షల కోట్లే 

రూ.14 లక్షల కోట్ల అప్పులున్నాయన్నది దుష్ప్రచారమే.. 2019లో బాబు దిగిపోయేనాటికే రూ.4.06 లక్షల కోట్ల అప్పులు 

ఈ లెక్కన బాబు సర్కార్‌ కంటే జగన్‌ ప్రభుత్వం చేసిన అప్పులే తక్కువ 

సాక్షి, అమరావతి: అప్పుల విషయంలో గత వైఎస్సార్‌సీపీ ప్ర­­భుత్వంపై ఎల్లో మీడియా చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలేనని అసెంబ్లీ సాక్షిగా, అదీ కూటమి ప్రభుత్వం సోమ­వారం ప్రవేశపెట్టిన 2024–­25 బడ్జెట్‌లోనే తేలిపోయింది. మరో పక్క చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్‌కు రూ.­91,443 కోట్ల అప్పులు, మరో రూ.1.09 లక్షల కోట్ల ప­న్నులు ఆధారంగా ఉండటం విశేషం. 

ఓసారి రూ.­14 లక్షల కోట్లు అప్పులని, మరోసారి రూ.10 లక్షల కోట్లు అ­ప్పు­లు చేశారని, రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేశారంటూ గత ప్రభుత్వంపై ఎల్లోమీడియా చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి పయ్యావుల సోమ­వారం అసెంబ్లీకి సమరి్పంచిన బడ్జెట్‌ పత్రాల్లో స్పష్టమైంది. బడ్జెట్‌ అప్పులతో పాటు గ్యారెంటీల ద్వారా చేసిన అప్పులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి అంటే 2023–24 ఆర్థిక ఏడాది పూర్తయ్యే­నాటికి రూ.6.46 లక్షల కోట్లేనని బడ్జెట్‌ పత్రాల్లో మంత్రి పే­ర్కొన్నారు. 

ఇందులో బడ్జెట్‌ అప్పులు 2023–24 మార్చి కి రూ.4.91 లక్షల కో­ట్లేనని పేర్కొన్నారు. ప్రభుత్వం గ్యారెంటీ ఇ­చ్చిన అప్పులు రూ.1.54 లక్షల కోట్లేనని చెప్పారు. 2024–25 ఏడాది మార్చికి బడ్జెట్‌ అప్పులు రూ.­5,60,094.25 కోట్లకు చేరతాయని, ఇది జీఎస్‌డీపీలో 34.14%గా ఉంటుందని మంత్రి బడ్జెట్‌ డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు.

వైఎస్‌ జగన్‌ పాలనలోనే అప్పులు తక్కువ
ఇవాళ అసెంబ్లీ సాక్షిగా తేలిన రాష్ట్ర అప్పు రూ.6,46,531 కోట్లు. ఇందులో చంద్రబాబు 2019లో దిగిపోయే నాటికే రూ.4,06,383 కోట్ల అప్పు ఉంది. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కోవిడ్‌ సమయంలో సైతం పెద్ద ఎత్తున సంక్షేమాభివృద్ధి పథకాలు అమలు చేస్తూ.. సుమారు రూ.2 లక్షల కోట్లకుపైగా డీబీటీ ద్వారా పేదల ఖాతాల్లో జమ చేసినప్పటికీ రాష్ట్ర అప్పు ఇంతేనని తేలింది. ఈ లెక్కన వైఎస్‌ జగన్‌ హయాంలో చేసిన అప్పు కంటే చంద్రబాబు హయాంలో చేసిన అప్పులే ఎక్కువని బట్టబయలైంది. రూ.14 లక్షల కోట్ల అప్పులు అంటూ టీడీపీ కూటమి నేతలు చెప్పింది దు్రష్పచారం అని తేటతెల్లమైంది. 

Advertisement
 
Advertisement
Advertisement