‘చర‍్చలకు వచ్చేవరకూ ఎదురుచూస్తాం’ | We Will Wait Until Employees Come To Negotiations Perni Nani | Sakshi
Sakshi News home page

‘చర‍్చలకు వచ్చేవరకూ ఎదురుచూస్తాం’

Jan 27 2022 5:33 PM | Updated on Jan 27 2022 6:20 PM

We Will Wait Until Employees Come To Negotiations Perni Nani - Sakshi

సాక్షి, అమరావతి: ఉద్యోగులు చర్చలకు వచ్చే వరకూ ఎదురుచూస్తామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.  ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులని, 3 రోజులు కాదు.. 30 రోజులైనా ఎదురుచూస్తామన్నారు. 

‘చర్చలకు వచ్చుంటే ఈపాటికే సమస్య పరిష్కారం అయ్యేదేమో. జీవోలు రద్దు చేసేంత వరకూ చర్చలకు రామని చెప్పడం సమంజసం కాదు. జిల్లాల ఏర్పాటు చంద్రబాబుకి హఠాత్తుగా కనిపించొచ్చు. కానీ మేము రెండేళ్లుగా ఈ ప్రక్రియ చేస్తున్నాం. ఎన్టీఆర్ పేరు పెట్టేసరికి చంద్రబాబు షాక్‌కి గురయ్యారు. అందుకే ఎన్టీఆర్ పేరు పై స్పందించడం లేదు. ఎన్టీఆర్ కుటుంబీకులు పురందేశ్వరి, రామకృష్ణ స్వాగతించినందుకు సంతోషం’ అని అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement