సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ) 2025–26 ఆర్థిక సంవత్సరంలో 327 రోజుల్లోనే 80.08 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేసి రికార్డు సృష్టించింది. గతంలో ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి పోర్టుకు 350 రోజులకు పైగా సమయం పట్టేది.
అధికారుల వ్యూహాత్మక కృషి, అత్యాధునిక నిర్వహణ సామర్థ్యమే ఈ విజయానికి కారణమని పోర్టు ఇన్‌చార్జ్ చైర్మన్ డా.అంగముత్తు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యమైన 90 మిలియన్ మెట్రిక్ టన్నులను ముందుగానే చేరుకుంటామన్నారు. ఈ ఘనతకు కారణమైన సిబ్బంది, స్టేక్ హోల్డర్లను డా.అంగముత్తు అభినందించారు.


