పార్లమెంట్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం తరహాలోనే..!

Vijayawada Swaraj Maidan 125 Feet BR Ambedkar Statue To Be Built - Sakshi

స్వరాజ్‌ మైదాన్‌లో విగ్రహ నిర్మాణంపై మంత్రుల సమావేశం

పార్కు సుందరీకరణకు డిజైన్‌ సమర్పించిన ఐదుగురు కన్సల్టెంట్లు

సాక్షి, అమరావతి: భారత పార్లమెంట్‌లోని డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం తరహాలోనే.. విజయవాడలోని స్వరాజ్‌ మైదాన్‌లో 125 అడుగుల విగ్రహం డిజైన్‌ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో చెన్నైకి చెందిన కన్సల్టెంట్‌ ఇచ్చిన విగ్రహ డిజైన్‌ను ఖరారు చేశారు.
(చదవండి: యరపతినేని అనుచరులు 13 మందిపై సీబీఐ కేసు)

► పార్క్‌ సుందరీకరణకు ఐదుగురు కన్సల్టెంట్స్‌ నుంచి డిజైన్‌లు రాగా, వీటన్నింటినీ పరిశీలించారు. 
► విగ్రహం కింద పీట (పెడస్టల్‌) ఎత్తు 30 అడుగులు ఉంటుంది. దీనిపై 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తారు. కింది భాగంలో గ్రంధాలయం, ధ్యాన మందిరం, కన్వెన్షన్‌
హాలు వంటివి ఏర్పాటు చేస్తారు. మిగిలిన స్థలంలో పార్క్‌ ఉంటుంది.
►  పచ్చదనం ఉండే డిజైన్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వ ఆలోచన కాగా, సర్వాంగ సుందరంగా సందర్శకులను ఆకట్టుకునే విధంగా వచ్చే డిజైన్‌లకు అధిక ప్రాధాన్యత
ఇవ్వనున్నారు. 
► వచ్చే నెల 2న విగ్రహ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ సమావేశంలో కమిటీ సభ్యులు తుది డిజైన్‌ ఖరారు చేస్తారు. సీఎం సూచనలు తీసుకున్న తరువాత
పనులు మొదలు పెట్టాలని నిర్ణయించారు. సమావేశంలో అధికారులు కరికాల వలవన్, ముద్దాడ రవిచంద్ర, హర్షవర్థన్, గ్రీన్‌ కార్పొరేషన్‌ ఎండీ చంద్రమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top