స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు ఎంతదూరమైనా వెళ్తాం

Vijaya Sai Reddy Comments On Visakha Steel Plant - Sakshi

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి

సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఎంతదూరమైనా వెళతామని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయ సాయిరెడ్డి స్పష్టంచేశారు. మంగళవారం విశాఖ నగర పార్టీ కార్యాలయంలో మంత్రులు కన్నబాబు, ముత్తం శెట్టి శ్రీనివాసరావులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణపై లోక్‌సభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం రాష్ట్ర ప్రజలను, కార్మికసంఘాలను, ఉక్కు ఉద్యోగులను, కార్మికులను తీవ్ర నిరాశకు, ఆందోళనకు గురి చేసిందన్నారు. సంస్థ లాభాల్లోకి రావడానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 6న ప్రధాన మంత్రికి రాసిన లేఖలో రెండు ప్రత్యామ్నాయాలను సూచించారన్నారు.

సొంత గనులు కేటాయించడం, రుణ భారాన్ని మూలధనంగా మార్చడంతో 14 శాతం భారం తగ్గుతుందని, దానివల్ల నష్టాల నుంచి బయట పడవచ్చని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం ప్రధానమంత్రిని కలిసి వివరించడంతో పాటు అసెం బ్లీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేం ద్రానికి పంపిస్తామన్నారు. ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. లక్ష్యసాధన కోసం నాయకులు, కార్మిక సంఘాలు, రాజకీయ పక్షాలతో కలిసి అడుగులు వేస్తామన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top