ఎన్నిసార్లు మారతారు బాబు గారూ? | Vijaya Sai Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

ఎన్నిసార్లు మారతారు బాబు గారూ?

Jan 14 2021 4:59 PM | Updated on Jan 14 2021 9:31 PM

Vijaya Sai Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గురువారం ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘  చిత్తుగా ఓడిపోయి రెండేళ్లవుతున్నా ఎలా ఓడిపోయాడో  తెలియదంట సంక్రాంతి సృష్టికర్తనని చెప్పుకునే బాబు గారికి.  పైగా సారీ-పూర్తిగా మారిపోయానంటూ కొత్త డ్రామాలు మొదలెట్టారు. ఎన్నిసార్లు మారతారు బాబు గారూ? దేవాలయాలు ధ్వంసం చేస్తూ తన ఓటమికి ఇంకా ప్రజల్నే నిందిస్తున్నాడు’’ అని పేర్కొన్నారు. 

అంతకు ముందు మరో ట్వీట్‌లో.. ‘‘ అమూల్ రాకతో వరి పండించే రైతులే కాదు పాడి రైతులు కూడా  అదనపు ఆదాయంతో ఆనందంగా ఉన్నారు. మరి రాష్ట్రం ఇచ్చిన జీవోలను భోగిమంటల్లో వేయమంటారేంటి చంద్రబాబు గారూ? హెరిటేజ్ కంపెనీ ఆదాయం తగ్గినా లక్షలాది రైతులకు లాభం జరిగిందిగా! రైతు బాగుపడితే మీకు అంత కడుపుమంట ఎందుకు?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement