సోనూసూద్‌ చిత్రం.. 12 వరల్డ్‌ రికార్డులు

Vignan Student Dasari Yashwanth 12 World Records in Art Work - Sakshi

ఆర్ట్‌ వర్క్‌లో ఒకేసారి 12 వరల్డ్‌ రికార్డులు

‘లారా’ ఇంజనీరింగ్‌ విద్యార్థి ప్రతిభ

చేబ్రోలు (పొన్నూరు): గుంటూరు జిల్లా చేబ్రోలు మండల పరిధిలోని వడ్లమూడి విజ్ఞాన్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి దాసరి యశ్వంత్‌ ఆర్ట్‌ వర్క్‌లో 12 వరల్డ్‌ రికార్డులు సాధించాడని కళాశాల ప్రిన్సిపల్‌ కేపీ కుమార్‌ వెల్లడించారు. గత నెల 22న తెనాలిలోని శ్రీ చైతన్య స్కూల్‌ ఆవరణలో ఇండియన్‌ ఫిల్మ్‌ యాక్టర్, సోషల్‌ యాక్టివిస్ట్‌ అయిన సోనూసూద్‌ 2,938.548 అడుగుల చిత్రాన్ని 2 గంటల 57 నిమిషాలలో పూర్తి చేసి ఒకేసారి 12 వరల్డ్‌ రికార్డులు సాధించాడని పేర్కొన్నారు.

వరల్డ్‌ రికార్డులు అందించే టీం సభ్యులు ఈ చిత్రాన్ని పరిశీలించి, అతి తక్కువ సమయంలో దీనిని పూర్తి చేసినట్లు గుర్తించారన్నారు. ఇందుకు సంబంధించిన వరల్డ్‌ రికార్డు ధ్రువపత్రాలను ఈ నెల 3వ తేదీన విద్యార్థి యశ్వంత్‌కు అందజేసినట్లు చెప్పారు. రెండు చేతులతోను, రెండు కాళ్లతోను, నోటితోను బొమ్మలు వేయగలడం, 7 అడుగుల చిత్రాన్ని రివర్స్‌లో వేయడం యశ్వంత్‌ ప్రత్యేకతని తెలిపారు. వరల్డ్‌ రికార్డులు సాధించిన యశ్వంత్‌ను విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ లావు రత్తయ్య అభినందించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top