హేతువాద భావజాలంతోనే నాగరిక సమాజం
● కవిరాజు త్రిపురనేని రామస్వామి సాహిత్యం– నేటి ఆవశ్యకతపై ఏపీ హేతువాద సంఘం ప్రధాన కార్యదర్శి మేడూరి సత్యనారాయణ మాట్లాడుతూ కార్యకారణ సిద్ధాంతాన్ని నమ్మడం ద్వారా అసమానతల్లేని మంచి సమాజం నిర్మించవచ్చని కవిరాజు రామస్వామి బలంగా విశ్వసించారని అన్నారు. సమాజ మార్పుకు సాంస్కృతిక ఉద్యమాలు పెద్దఎత్తున రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.
● సభకు అధ్యక్షత వహించిన సమితి గౌరవాధ్యక్షులు గద్దె మంగయ్య మాట్లాడుతూ ధర్మశాస్త్రాలు అమానవీయ విశ్వాసాలకు వ్యతిరేకంగా తన రచనల ద్వారా బలమైన ఉద్యమాన్ని కవిరాజు త్రిపురనేని రామస్వామి సమాజాన్ని జాగృతం చేశారని చెప్పారు.
● అనంతరం మేడూరి సత్యనారాయణను జ్ఞాపిక, రూ.50 వేలు, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో సాహితీ సమితి అధ్యక్షులు ఆలోకం పెద్దబ్బాయి, కార్యదర్శి వల్లూరు తాండవ కృష్ణ, కోశాధికారి పాటిబండ్ల విష్ణువర్ధన్, నంబూరు నాగేశ్వరరావు, గంటా శివలక్ష్మి, జొన్నలగడ్డ రామారావు, ప్రిన్సిపల్ రవికుమార్, రామస్వామి అభిమానులు, ఉభయ తెలుగు రాష్ట్రాల హేతువాద సంఘాల నాయకులు పాల్గొన్నారు.
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా హేతువాద దృక్పథంతో మనిషి మనుగడ సాధించగలిగితేనే నాగరిక సమాజం మనగడ సాధిస్తుందని ప్రముఖ హైకోర్టు న్యాయవాది, త్రిపురనేని రామస్వామి సాహితీ సమితి పూర్వాధ్యక్షులు బైరపనేని నరేష్ అన్నారు. శుక్రవారం కవి రాజు త్రిపురనేని రామస్వామి సాహితీ సమితి ఆధ్వర్యంలో జేకేసీ కళాశాల రోడ్డు రాయపాటి రంగారావు విద్యా కళాశాల ప్రాంగణంలో జాతీయ పురస్కార సభ నిర్వహించారు.
హైకోర్టు న్యాయవాది, త్రిపురనేని రామస్వామి సాహితీ సమితి పూర్వాధ్యక్షులు బైరపనేని నరేష్