‘ఈరోజు ఉదయమే ఆయన కూతురితో మాట్లాడా’

Venkaiah naidu Pays Tribute To Manikyala Rao's Last Breath - Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి  పైడికొండల మాణిక్యాలరావు మృతిపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆకస్మికంగా లోకాన్ని విడిచివెళ్లిపోవడంపై వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి పైడికొండ మాణిక్యాలరావుగారు పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ‍్యక్తం చేస్తున్నా. క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధత గల కార్యకర్తగా, రాష్ట్ర మంత్రిగా చిత్తశుద్ధితో ప్రజల సమస్యల పరిష్కారానికి వారు చేసిన కృషి అభినందనీయం.

ఈరోజు ఉదయమే వారి కూతురు సింధుతో మాట్లాడి మాణిక్యాలరావుగారి ఆరోగ్యం గురించి వాకబు చేశాను. ఇంతలోనే ఇలా జరగడం విచారకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని ట్వీటర్‌ ద్వారా వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. పైడికొండ మాణిక్యాలరావు శనివారం కన్నుమూశారు. నెలరోజుల కిందట ఆయకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిశారు. (మాజీమంత్రి మాణిక్యాలరావు కన్నుమూత)

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top