రంగా ఎదుగుదలను ఓర్వలేక ఓ పార్టీ పొట్టన పెట్టుకుంది  | Vangaveeti Narendra comments on Vangaveeti Mohana Ranga | Sakshi
Sakshi News home page

రంగా ఎదుగుదలను ఓర్వలేక ఓ పార్టీ పొట్టన పెట్టుకుంది 

Dec 27 2022 4:45 AM | Updated on Dec 27 2022 2:36 PM

Vangaveeti Narendra comments on Vangaveeti Mohana Ranga - Sakshi

రంగా విగ్రహం ఆవిష్కరించి ప్రసంగిస్తున్న నరేంద్ర

చల్లపల్లి (అవనిగడ్డ): తనను నమ్మినవారికోసం ఎన్నో కష్టాలు పడుతూ, కుట్రలు, కుతంత్రాల మధ్య విజయపథంలో పయనిస్తున్న వంగవీటి మోహనరంగాను చూసి తట్టుకోలేక స్వార్థ ఆలోచనతో ఒక పార్టీ ఆయన్ని హత్యచేసేవరకు నిద్రపోలేదని రాధారంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర చెప్పా­రు. కృష్ణాజిల్లా చల్లపల్లిలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని ఆయన వర్ధంతి సందర్భంగా సోమవారం నరేంద్ర ఆవిష్కరించారు.  

ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడైనా రంగా విగ్రహం పెడుతున్నారంటే తప్పుచేసిన వారి వెన్నులో వణుకు పుడుతోందని చెప్పారు. నాడు రంగాను చంపిన పార్టీ నాయకులు ఇప్పుడు ఆయన విగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని విమర్శించారు. రంగా విగ్రహాలు పెడతామని, వర్ధంతి, జయంతి చేస్తామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. రాధారంగా మిత్రమండలి జిల్లా అధ్యక్షుడు ‘బుల్లెట్‌’ ధర్మారావు, జెడ్పీటీసీ సభ్యురాలు రాజులపాటి కల్యాణి, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement