Evaluating Two Year Of Y.S. Jagan Mohan Reddy’s Rule In AP: Reverse Tendering A Big Success And Big Save Public Money - Sakshi
Sakshi News home page

2 Years YSJagan ane nenu: ‘రివర్స్‌’లో అదుర్స్‌

May 29 2021 7:16 PM | Updated on May 30 2021 11:33 AM

 Two Years YS Jagan Rule AP Reverse Tendering - Sakshi

ప్రాజెక్టులు, పనులు, కాంట్రాక్టుల్లో అత్యంత పారదర్శక విధానాన్ని ప్రవేశ పెట్టారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.

వెబ్‌డెస్క్‌: సాగునీటి ప్రాజెక్టులంటే అవినీతికి ఆనవాళ్లు అనే పేరు. గత ప్రభుత్వం ఆ నానుడిని నిజం చేసి చూపింది. అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ పోలవరం పనులు అనేట్టుగా మార్చేసింది. ఇకపై కూడా అదే పంథా కొనసాగుతుంది.. ప్రజా ధనాన్ని దోచేసుకుందాం.. అనుకులే వాళ్ల గుండెల్లో గుబులు పుట్టించింది జగన్‌ సర్కారు. 

పారదర్శకతకు పెద్ద పీట
ప్రాజెక్టులు, పనులు, కాంట్రాక్టుల్లో అత్యంత పారదర్శక విధానాన్ని ప్రవేశ పెట్టారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే రివర్స్‌ టెండరింగ్, జ్యుడిషియల్‌ ప్రివ్యూ విధానాన్ని ప్రవేశపెట్టారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో అక్రమార్కుల తప్పుడు అంచనాలకు  అడ్డుకట్ట వేశారు.  ఫలితంగా రివర్స్‌​ టెండరింగ్‌ ద్వారా రెండేళ్ల కాలంలో రూ. 5,070 కోట్ల ప్రజాధనం పక్కదారి పట్టకుండా నిలువరించ గలిగారు.


ప్రజా ధనానికి కాపలా
జాతీయ ప్రాజెక్టయిన పోలవరంతో రివర్స్‌ టెండరింగ్‌ మొదలు పెట్టి ఇతర సాగునీటి ప్రాజెక్ట్‌లతో పాటు  మున్సిపల్, విద్య, వైద్య, విద్యుత్, హౌసింగ్, పంచాయతీరాజ్‌ సహా పలు శాఖల్లో అమలు చేశారు. కాంట్రాక్టుల్లో పారదర్శక విధానాలు అమలు చేయడం ద్వారా  భారీగా ప్రజా ధనాన్ని ఆదాచేయగలిగారు. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుతో పాటు జలవనరుల శాఖలో 26 పనులకు సంబంధించి  రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.1824.65 కోట్ల ప్రజాధనాన్ని ఏపీ ప్రభుత్వం ఆదా చేయగలిగింది.
        
ఇళ్ల నిర్మాణంలో రూ. 1203 కోట్లు
రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం అందించే పక్కా గృహాల నిర్మాణంలోనూ గత ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. అధిక రేట్లకు టెండర్లకు ఆమోదం తెలపడం ద్వారా అటు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. అంతేకాదు సబ్సిడీ తరువాత లబ్దిదారులు తమవంతుగా తిరిగి చెల్లించాల్సిన సొమ్మును కూడా అధికం అయ్యేలా చేశారు. అధికారం చేపట్టిన వెంటనే సీఎం జగన్‌ దీనిపై దృష్టి సారించారు. ఏపీ టౌన్‌షిప్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌ మెంట్‌ కార్పోరేషన్‌ (టిడ్కో) లో రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించారు. దీంతో గృహనిర్మాణశాఖ (ఏపీ టిడ్కో)లో చేపట్టిన 12 పనుల్లో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా  రూ. 392.23 కోట్ల రూపాయల ఆదా అయ్యింది. మరోవైపు గహనిర్మాణశాఖలో గ్రామీణ ప్రాంతాల్లో 5 పనులకు సంబంధించి చేపట్టిన రివర్స్‌టెండరింగ్‌లో రూ.811.32 కోట్లు మిగులు వచ్చేలా చేసింది ఏపీ ప్రభుత్వం. 
 
ఒకదాని వెంట ఒకటి
పంచాయితీరాజ్‌ శాఖకు సంబంధించి 7 పనులకు గాను రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించగా రూ.605.08 కోట్ల ప్రజాధనం ఆదా అయింది. ఏపీ జెన్కోలో 4 పనులకు గాను రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించడం ద్వారా రూ.486.46 కోట్ల ప్రజా ధనం పక్కదారి పట్టకుండా ఆపగలిగారు. విద్యాశాఖలో కూడా గత ప్రభుత్వం హయాంలో పెద్ద ఎత్తున ప్రజాధనం వృధా కాగా వైయస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 21 పనులుకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించగా ఏకంగా రూ. 325.15 కోట్లు ఆదా అయ్యాయి. 


వైద్యశాఖకు రివర్స్‌ చికిత్స
వైద్య ఆరోగ్య శాఖలో కూడా గత ప్రభుత్వ హయాంలో టెండర్లలో చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌ మెడికిల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్టర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎంఎస్‌ఐడీసీ)లో చేపట్టిన 34 పనులకు రివర్స్‌ టెండర్లు నిర్వహించారు. వీటి ద్వారా  రూ.625.54 కోట్లు ప్రజాధనం ఆదా అయింది. మొత్తంగా రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ ద్వారా 7 ప్రభుత్వ శాఖలకు సంబంధించి రూ.5070.43 కోట్లు ప్రజాధనం ఆదా అయింది.

రివర్స్‌ టెండర్‌ ఫలితాలు శాఖల వారీగా
1. పోలవరం ప్రాజెక్టు సహా జలవనరులశాఖ     : రూ.1824.65 కోట్లు
2. ఏపీ టిడ్కో                                               :    రూ.392.23 కోట్లు
3. గృహనిర్మాణశాఖ (రూరల్‌)                         : రూ.811.32  కోట్లు
4. పంచాయతీరాజ్‌శాఖ                                  : రూ. 605.08 కోట్లు
5. ఏపీ జెన్కో                                               : రూ. 486.46 కోట్లు
6. విద్యాశాఖ                                               : రూ. 325.15 కోట్లు
7. APMSIDC                                            : రూ. 625.54 కోట్లు
.............................................................................................
మొత్తం                                                        రూ.5070.43 కోట్లు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement