సాధారణ టికెట్‌తోనే రిజర్వ్‌డ్‌ కోచ్‌లో ప్రయాణం

Travel in Reserved Coach with Regular Ticket: Vijayawada Railway PRO - Sakshi

50 రైళ్లలో వెసులుబాటు.. విజయవాడ రైల్వే పీఆర్వో వెల్లడి

సాక్షి, రైల్వేస్టేషన్‌ (విజయవాడ): అన్‌ రిజర్వ్‌డ్‌ ప్రయాణికుల సౌకర్యం కోసం విజయవాడ డివిజన్‌ పరిధిలో నడిచే 50 రైళ్లలో కొన్ని రిజర్వ్‌డ్‌ కోచ్‌లను సాధారణ కోచ్‌లుగా మార్చి నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్వో నస్రత్‌ మండ్రూపక్కర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

గూడురు– సికింద్రాబాద్, గూడురు–విజయవాడ, విజయవాడ–సికింద్రాబాద్, నర్సాపూర్‌–ధర్మవరం, తిరుపతి–కాకినాడ టౌన్, నర్సాపూర్‌–లింగంపల్లి, మచిలీపట్నం–బీదర్, విజయవాడ– లింగం పల్లి, తిరుపతి–ఆదిలాబాద్‌ రైళ్లతో సహా 50 రైళ్లలో గుర్తించిన కొన్ని రిజర్వ్‌డ్‌ కోచ్‌లలో సాధారణ ప్రయాణికులు ఎక్కేందుకు అవకాశం కల్పించినట్లు ఆమె తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. 

చదవండి: (‘అమ్మా ! నేను అందరిలా మళ్లీ బడికెళ్లగలనా..?')

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top