టాప్‌ న్యూస్‌.. నేటి విశేషాలు

Today Top News 24th December 2020 - Sakshi

పులివెందుల రుణం ఎప్పటికీ తీరనిది: సీఎం జగన్‌
పులివెందుల ప్రాంతానికి ఎంత చేసినా రుణం తీర్చుకోలేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా కడప జిల్లా పులివెందుల చేరుకున్న సీఎం రూ.5 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పూర్తి వివరాలు..

జానాకి పోటీ.. రంగంలోకి యువనేత 
ఇటీవల జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న టీఆర్‌ఎస్‌ పార్టీకి రాబోయే ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు సవాల్‌గా మారాయి. మరోవైపు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో మరో ఉప ఎన్నికను ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది. పూర్తి వివరాలు..

రూ.4,109 కోట్ల అగ్రిగోల్డ్‌ ఆస్తుల జప్తు
అగ్రిగోల్డ్‌కు చెందిన 4,109 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) తాత్కాలికంగా జప్తు చేసింది. గురువారం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశాలలోని అగ్రిగోల్డ్‌ ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఏపీలో 56 ఎకరాల హాయ్‌లాండ్‌ ఆస్తులు.. పలు కంపెనీల్లో వాటాలు, యంత్రాలను అటాచ్‌ చేసింది. పూర్తి వివరాలు..

ఆ ‘ఐఫోన్ల’ కంపెనీలో అక్రమాలెన్నో!
భారత ఐటీ హబ్‌గా ప్రసిద్ధి చెందిన బెంగళూరు నగరం శివారులో ఐఫోన్లను తయారు చేసే ‘విస్ట్రాన్‌ ఫెసిలిటీ’లో డిసెంబర్‌ 12వ తేదీ రాత్రి, నైట్‌ షిప్టులో పని చేస్తోన్న దాదాపు రెండు వేల మంది కార్మికులు ఆందోళనకు దిగి విధ్వంసం సృష్టించిన విషయం తెల్సిందే. సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ కార్యాలయాలను ధ్వంసం చేయడంతోపాటు వేలాది ఐఫోన్లు, లాప్‌ టాప్‌లను కార్మికులు ఎత్తుకెళ్లారు. పూర్తి వివరాలు.. 

తలైవి: ఎంజీఆర్‌ లుక్‌ రిలీజ్‌ 
నిజ జీవిత పాత్రలు చేయాలంటే ఆషామాషీ కాదు. అందులోనూ ప్రముఖుల జీవిత కథల్లో నటించేటప్పుడు వారి హావభావాలు, ఊతపదాలు, నడత, నడక అన్నీ వారిని తలపించేలా ఉండాలి. స్వయంగా ఆ ప్రముఖులు మళ్లీ కళ్లముందు కనిపించేలా మ్యాజిక్‌ చేయాలి. నటుడు అరవింద్‌ స్వామి కూడా ఈ విషయంలో సక్సెస్‌ సాధించినట్లే కనిపిస్తోంది. పూర్తి వివరాలు.. 

దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది: ఆర్‌బీఐ 
అంచనాలకంటే వేగంగా దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నట్లు ఆర్‌బీఐ తాజాగా అభిప్రాయపడింది. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) మూడో క్వార్టర్‌(అక్టోబర్‌-డిసెంబర్‌)లో దేశ జీడీపీ ప్రతికూల బాటలను వీడి స్వల్ప వృద్ధిని చూపవచ్చని అంచనా వేసింది. అయితే వృద్ధి అవకాశాలను దెబ్బతీయకుండా ధరల(ద్రవ్యోల్బణం)కు ముకుతాడు వేయవలసి ఉన్నట్లు పేర్కొంది. పూర్తి వివరాలు..

ఐపీఎల్‌: బీసీసీఐ కీలక నిర్ణయం! 
ఐపీఎల్‌–2022 సీజన్‌కు సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 8 జట్లతో పాటు అదనంగా మరో రెండు టీమ్‌లను కొత్తగా చేర్చనుంది. దీంతో మొత్తంగా 10 జట్లు ఈ మెగాటోర్నీలో టైటిల్‌ కోసం తలపడనున్నాయి. ఈ మేరకు గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. పూర్తి వివరాలు..

10 రోజుల్లో 10 లక్షల మందికి వ్యాక్సిన్లు
ప్రపంచంలోనే కోవిడ్‌-19 కారణంగా అత్యధిక సంఖ్యలో బాధితులున్న అమెరికాలో వ్యాక్సినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. వెరసి ప్రభుత్వం గత 10 రోజుల్లోనే 10 లక్షల మందికిపైగా వ్యాక్సిన్లను అందించింది. జర్మన్‌ కంపెనీ బయోఎన్‌టెక్ సహకారంతో యూఎస్‌ దిగ్గజం ఫైజర్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు ఈ నెల 14న యూఎస్‌ఎఫ్‌డీఏ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. పూర్తి వివరాలు..

తెలంగాణలో ఈ ఏడాది స్కూళ్లు బంద్‌
తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం 1 నుంచి 5వ తరగతుల వరకు స్కూళ్లు తెరవొద్దని ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయం తీసుకుంది. ఆయా తరగతుల వరకు నేరుగా ప్రమోట్‌ చేసే అవకాశం ఉంది. పూర్తి వివరాలు..

ఆ కంపెనీతో 2 వేల మందికి ఉపాధి: సీఎం జగన్‌
ఆంధ్రపదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల ఇండస్ట్రియల్ ఏరియాలో ఏర్పాటు చేయనున్న అపాచీ లెదర్ ఇండస్ట్రీకి గురువారం శంకుస్థాపన చేశారు. భూమి పూజ అనంతరం అపాచీ ఇంటెలిజెంట్ గ్రూప్ ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి మొక్కను నాటారు. పూర్తి వివరాలు..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top