రూ.4,109 కోట్ల అగ్రిగోల్డ్‌ ఆస్తుల జప్తు

ED Attaches 4109 Crore Worth Property Of Agrigold - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అగ్రిగోల్డ్‌కు చెందిన 4,109 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) తాత్కాలికంగా జప్తు చేసింది. గురువారం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశాలలోని అగ్రిగోల్డ్‌ ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఏపీలో 56 ఎకరాల హాయ్‌లాండ్‌ ఆస్తులు.. పలు కంపెనీల్లో వాటాలు, యంత్రాలను అటాచ్‌ చేసింది. కాగా, బుధవారం అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావు, డైరెక్టర్లు శేషు నారాయణ రావు, హేమ సుందర వరప్రసాద్‌ రావును ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. (ఏటీఎం చోరీలు..నిందితుల హిస్టరీ చూస్తే..)

వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించగా, వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు. అగ్రిగోల్డ్ సుమారు 32 లక్షల మంది వద్ద 6,380 కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లు ఈడీ అధికారులు కనుగొన్నారు. 942 కోట్ల రూపాయల డిపాజిటర్ల సొమ్మును ఇతర వ్యాపారాలకు మళ్లించినట్లు గుర్తించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top