Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

Telugu Trending News Breaking News Evening News Roundup 27th Sep 2022 - Sakshi

1. తిరుమల పర్యటనలో సీఎం వైఎస్‌ జగన్‌
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. తిరుపతి గ్రామదేవత, శ్రీవారి సోదరి శ్రీతాతయ్యగుంట గంగమ్మను ఆయన దర్శించుకున్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. పశుసంవర్థక శాఖ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీని పూర్తిచేయాలి: సీఎం జగన్‌
పశు సంవర్ధక శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పశువుల ఆస్పత్రుల్లో నాడు– నేడు, పశువులకు బీమా, ఫ్యామిలీ డాక్టర్‌ తరహాలో పశువులకు వైద్య సేవలు తదితర అంశాలపై అధికారులకు సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ఉద్దవ్‌ థాక్రేకు బిగ్‌ షాక్‌.. షిండేకు అనుకూలంగా వెలువడ్డ సుప్రీం తీర్పు
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రేకు భారీ ఎదురు దెబ్బ తగిలింది.శివసేన పార్టీ గుర్తింపు వ్యవహారంలో.. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేకు అనుకూలంగా సుప్రీం కోర్టులో తీర్పు వెలువడింది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. రష్యా చెర నుంచి బయటపడిన ఉక్రెయిన్‌ సైనికుడి షాకింగ్‌ ఫోటోలు
రష్యన్ల బంధిఖానా నుంచి బయటపడిన ఉక్రెయిన్‌ సైనికుడి షాకింగ్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ ఫోటోలను ఉక్రెయిన్‌ రక్షణ మంత్రిత్వశాఖ మైఖైలో డయానోవ్‌ అనే ఉక్రెయిన్‌ సైనికుడి ఫోటోలను ట్విట్టర్‌లో పంచుకుంది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ‘నీ కొడుకు మీద ప్రమాణం చేసి చెప్పు లోకేష్‌.. అమ్మవారి కిరీటాలు ఎత్తుకెళ్లిందెవరు?’
ఇటీవలి కాలంలో టీడీపీ నేతలు ప్రతీ విషయాన్ని వివాదాస్పదం చేస్తూ రెచ్చిపోతున్నారు. లేనిది ఉన్నట్టుగా ఊహించుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ఓవర్‌గా కామెంట్స్‌ చేసిన నారా లోకేష్‌కు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కౌంటర్‌ ఇచ్చారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. బంగారు మైన్స్‌లో పెట్టుబడులు.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్న ఈడీ!
ఇటీవలి కాలంలో పలు కేసుల్లో తెలంగాణలో ఈడీ, ఐటీ అధికారులు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడం, విచారించడం తెలంగాణలో సంచలనంగా మారింది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఈ ముగ్గురిని ఎంపిక చేసి తప్పుచేశారా? వీళ్లకు బదులు..
టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీ ఆరంభానికి సమయం ఆసన్నమవుతోంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో పాల్గొనే దేశాలు ఇప్పటికే జట్లను ప్రకటించాయి.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. నోట్ల రద్దు రాజ్యాంగ బద్ధమేనా? సుప్రీంలో విచారణ 
దేశంలో 86 శాతం చలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ  2016లో తీసుకున్న సంచలన  నిర్ణయం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. నల్లధనం, నకిలీ నోట్ల చలామణికి చెక్‌ పెట్టేందుకంటూ  రాత్రికి రాత్రే ప్రకటించిన ఈ నిషేధం పెను దుమారాన్ని సృష్టించింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. విషాదం.. జబర్దస్త్ కమెడియన్ కన్నుమూత
టాలీవుడ్‌లో విషాదం నెలకొంది.మిమిక్రీ ఆర్టిస్ట్, జబర్దస్త్ కమెడియన్ మూర్తి కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆయన మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు అరుణ్ స్వయంగా ధ్రువీకరించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఆనందం మాటున పొంచి వున్న ప్రమాదాలు
గత రెండేళ్లుగా వేసవి, సంక్రాంతి, దసరా వంటి సెలవులు వచ్చినప్పటికీ.. కరోనా కారణంగా ప్రజలు ఎవరూ కూడా ఆనందంగా గడిపి ఆస్వాదించలేక పోయారు. ఇక విద్యార్థులు కూడా సెలవుల్లో ఆటలకు దూరంగా ఉన్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top