‘బాలయ్య కరోనా మంత్రం’పై జోకులే జోకులు!

TDP MLA Hero Balakrishna Violation Of Corona Social Distance Norms - Sakshi

సాక్షి, అనంతపురం: వివాదాస్పదమైన వ్యాఖ్యలు, ప్రవర్తనతో వార్తల్లో నిలిచే టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా ప్రజలకు ఉచిత సలహాలిచ్చి విమర్శలు కొనితెచ్చుకున్నారు. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికైన బాలయ్య 9 నెలలుగా అటువైపు కన్నెత్తైనా చూడలేదు. ఈక్రమంలో ఆయన తీరుపై స్థానికంగా విమర్శలు రావడంతో సోమవారం హిందూపురంలో పర్యటించారు. అయితే, భౌతికదూరం నిబంధనలను పాటించకుండా సమావేశంలో పాల్గొన్నారు.
 (దళితులు గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు)

దాంతోపాటు.. కరోనాకు భయపడొద్దని, వేద మంత్రాలతో కరోనాను ఎదుర్కొందామని చెప్తూ లలిత త్రిపుర సుందరి మంత్రాన్ని చదివి వినిపించారు. కరోనా నివారణ కోసం ఈ మంత్రాన్ని పఠించాలని ప్రజలకు సూచించారు. తాను చెప్పిన మంత్రాన్ని 108 సార్లు చెబితే కరోనా దరిచేరదని బాలకృష్ణ పేర్కొన్నారు. కరోనా బారిన పడకుండా ప్రజలకు జాగ్రత్తలు చెప్పాల్సింది పోయి మంత్రాలు చదవమనడంపై సోషల్‌ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ‘బాలయ్య కరోనా మంత్రం’ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. (టీడీపీ నేతలు దండుపాళ్యం బ్యాచ్’)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top