వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ | TDP Activists Attacks On YSRCP Supporters At Markapuram, Watch Shocking Video Goes Viral | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ

Sep 23 2024 8:59 AM | Updated on Sep 25 2024 11:21 AM

TDP Activists On YSRCP Supporters At Markapuram

సాక్షి, తాడేపల్లి: ఏపీలో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. కూటమి పాలనలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడిపిస్తూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను టార్గెట్‌ చేసి దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మహిళలు అని కూడా చూడకుండా పచ్చ మంద కత్తులు, క‍ర్రలతో దాడి చేశారు. ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

వైఎస్సార్‌సీపీ ట్విట్టర్‌ వేదికగా టీడీపీ కార్యకర్తలు మహిళలపై దాడి చేసిన వీడియోను షేర్‌ చేసింది. ఈ సందర్బంగా.. రాష్ట్రంలో టీడీపీ గూండాలు బరితెగించారు. మార్కాపురం నియోజకవర్గం పొదిలి పట్టణం ఐదవ వార్డులోని నవాబుమెట్టలో వైఎస్సార్‌సీపీ మహిళా కార్యకర్తలపై కర్రలు, కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసిన టీడీపీ గూండాలు. వీరి దాడిలో మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చి, పాలనను గాలికి వదిలేసి మహిళలపై దాడులు జరుగుతున్నా ఏమీ పట్టనట్టు చోద్యం చూస్తున్నారా సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత’ అంటూ ఘాటు విమర్శలు చేసింది. 

 


 ఇది కూడా చదవండి: చంద్రబాబు మార్కు ‘కుట్ర’ తప్పు జరిగితే కేసు ఎందుకు పెట్టలేదు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement