'డబ్బే ముఖ్యమని హింసించారు.. నన్ను అర్థం చేసుకోలేదు' | Tarun Kumar Commits Suicide in Punganur Chittoor District | Sakshi
Sakshi News home page

వాట్సప్‌ స్టేటస్‌లో తల్లిదండ్రుల వేధింపులు.. ఆపై బలవన్మరణం

May 3 2022 7:01 PM | Updated on May 3 2022 7:29 PM

Tarun Kumar Commits Suicide in Punganur Chittoor District - Sakshi

సాక్షి, చిత్తూరు: తల్లిదండ్రుల డబ్బు ఆశకు తరుణ్‌ కుమార్‌ అనే యువకుడు బలయ్యాడు. ఈ ఘటన పుంగనూరులో చోటుచేసుకుంది. బీటెక్‌ చదివిన తరుణ్‌కు కొద్ది రోజుల క్రితం ఓ అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. అయితే కొద్ది రోజులకే ఆ వివాహ నిశ్చయం రద్దయింది.

ఈ క్రమంలోనే తల్లి దండ్రులు డబ్బే ముఖ్యమంటూ హింసించారని వాట్సప్‌ స్టేటస్‌ పెట్టి తరుణ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాది నుంచి ఇంట్లో రకరకాలుగా హింసించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తల్లిదండ్రులు కావాలనే పెళ్లి రద్దు చేసి ఇబ్బంది పెట్టారని వాట్సప్‌ స్టేటస్‌లో తెలిపాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చదవండి: (నా కారునే ఆపుతావా అంటూ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దాడి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement