
సాక్షి, రాజమండ్రి: వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. మద్యం అక్రమ కేసులో మిథున్‌రెడ్డికి ఏసీబీ కోర్టు సోమవారం (సెప్టెంబర్29న) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన మిథున్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులు భారీ ఎత్తున స్వాగతం పలికాయి
అంతకుముందు మిథున్‌రెడ్డి జైలు నుంచి విడుదలపై ఉత్కంఠ నెలకొంది. మద్యం అక్రమ కేసులో మిథున్‌రెడ్డికి ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పత్రాలు సెంట్రల్ జైలు అధికారిక ఈమెయిల్‌కు పంపించింది. అయితే ఎంపీ మిథున్‌రెడ్డి జైలు నుంచి విడుదలకు సంబంధించిన పత్రాలు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారిక మెయిల్‌కు వెళ్లినా.. మెయిల్‌కు పత్రాలు రాలేదని జైలు అధికారులు తెలిపారు.
దీంతో ఎంపీ మిథున్‌రెడ్డికి బెయిల్ వచ్చినా ఎందుకు విడుదల చేయడం లేదంటూ జైలు అధికారులతో న్యాయవాదులు మాట్లాడారు. మిథున్‌రెడ్డి విడుదలలో జాప్యంపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జైలు అధికారులు ఎంపీ మిథున్‌రెడ్డిని జైలు నుంచి విడుదల చేశారు. విడుదల అనంతరం మిథున్‌రెడ్డికి పార్టీ నేతలు,శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
